బుల్లితెరపై రష్మీ సుధీర్ జోడీకి ఎవర్ గ్రీన్ జోడీగా గుర్తింపు ఉంది.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో సుధీర్ రష్మీ స్కిట్ చేసి సందడి చేశారు.
బాయ్స్ సినిమాలోని పదహారు ప్రాయంలో సాంగ్ తో సుడిగాలి సుధీర్, కెవ్వు కార్తీక్ ఎంట్రీ ఇవ్వగా కెవ్వు కార్తీక్ ఇలాంటి మాటలు చెబితేనే సుధీర్ ను మార్కెట్ లో కొట్టారని అన్నారు.ఆ తర్వాత సుధీర్ మార్కెట్ లో మా అమ్మ చెప్పింది చేస్తే కొట్టారని ఇలాంటి మాటలకు కాదని అన్నారు.
మా అమ్మ బెండకాయలు లేతగా ఉన్నాయో లేదో గిల్లి చూడాలని చెప్పిందని నేను బెండకాయను పట్టుకుని అమ్మాయిని గిల్లానని సుధీర్ కామెంట్లు చేశారు.సుధీర్ కు 2,000 కోట్లు రావాలంటే 24 గంటల పాటు ఏ అమ్మాయిని చూడకుండా ఉండాలని తాత కండీషన్ పెట్టాడని కెవ్వు కార్తీక్ చెప్పగా సుడ్డి బేబీ అంటూ రష్మీ స్కిట్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత బహారీ బన్ కే ఆవో అంటూ సుధీర్ కోసం ప్రేమగా పాట పాడారు.
నా వల్ల కావట్లేదు నేను చూసేస్తా అని సుధీర్ చెబుతాడు.

ఆ తర్వాత రష్మీ ఎవరో ఏదో అన్నారని నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలీదు కానీ అని చెబుతుండగా రోజా మొదట డైలాగ్ కన్ఫ్యూజ్ అయ్యి ఆ తర్వాత నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తా అంటూ చెప్పుకొచ్చారు.సుధీర్ డైలాగ్ ను చంపేస్తున్నారమ్మా అంటూ ఫేస్ చూపించకుండానే డైలాగ్ చెబుతారు.ఆ తర్వాత సుధీర్ నువ్వు చచ్చిపోతే నువ్వు ఏడుస్తా అంటూ రష్మీ నవ్వులు పూయించారు.

2022 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.రష్మీ సుధీర్ జోడీ కెమిస్ట్రీ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
రష్మీ సుధీర్ రీల్ లైఫ్ కపుల్ అయినా ప్రేక్షకుల్లో ఈ జోడీపై ఆదరాభిమానాలు మాత్రం తగ్గడం లేదు.







