ముందు బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రాశి ఖన్నా.స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లకపోయినా యంగ్ హీరోల సరసన నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంది.
హిట్లు ఫ్లాపులతో కెరియర్ కొనసాగిస్తున్న రాశి ఖన్నా తెలుగులో లేటెస్ట్ గా వచ్చిన రెండు సినిమాలతో నిరాశపరచింది.గోపీచంద్ హీరోగా మారుతి డైరక్షన్ లో వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా ఈమధ్యనే రిలీజై ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
ఇక నిన్న శుక్రవారం నాగ చైతన్యతో రాశి నటించిన థ్యాంక్యూ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ రెండు సినిమాల మీద చాలా హోప్స్ పెట్టుకున్న రాశి ఖన్నా రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోకపోవడంతో మళ్లీ కెరియర్ రిస్క్ లో పడ్డది.
తెలుగులో ఆమెకి తర్వాత ఛాన్స్ ఏది రాలేదని తెలుస్తుంది.అయితే తెలుగులో ఇలా ఉంటే అమ్మడు తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం తమిళంలో ధనుష్ హీరోగా వస్తున్న ఒక సినిమాతో పాటుగా సర్దార్ అనే సినిమా కూడా చేస్తుంది.ఈ సినిమాతో పాటుగా యోధ అనే హిందీ సినిమా కూడా చేస్తుంది రాశి ఖన్నా.

తెలుగులో ఓ మోస్తారు అవకాశాలు మాత్రమే వస్తుండగా తమిళ, హిందీ పరిశ్రమల్లో మాత్రం రాశికి మంచి అవకాశాలే వస్తున్నాయని చెప్పొచ్చు.అయితే తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వాలని అమ్మడు కలలు కంటుంది.ఈమధ్య గ్లామర్ విషయంలో కూడా తగ్గేదేలే అని ఫోటో షూట్స్ తో హింట్స్ ఇస్తుంది రాశి ఖన్నా.పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ ఈ రెండు సినిమాల్లో రాశి తన పాత్ర పరంగా మెప్పించినా సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవలేదు కాబట్టి ఆమె నెక్స్ట్ ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.







