ఆ పాత్రకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానంటున్న రాశి ఖన్నా... 

ప్రతీ రోజు పండుగే ఈ చిత్రంలో టిక్ టాక్ స్టార్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి రాశి కన్నా తాజాగా "వరల్డ్ ఫేమస్ లవర్" అనే చిత్రంలో నటించింది.

ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించాడు.

అయితే ఈ చిత్రానికి దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మించారు.అలాగే ఈ చిత్రంలో కేతరిన్, ఇసాబెల్లా, ఐశ్వర్య రాజేష్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ రాశి కన్నా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.ఇందులో భాగంగా ఈ చిత్ర విశేషాలను తన అభిమానులతో పంచుకున్నారు.

ఈ చిత్రంలోని తను నటించినటువంటి యామిని పాత్రకి బాగా కనెక్ట్ అయ్యానని అంతేగాక ఆ పాత్రలో నటిస్తున్న సన్నివేశాల్లో ఒక్కోసారి ఎమోషనల్ అయ్యే ఏడ్చేసేదాన్ని అంటోంది ఈ అమ్మడు.అంతేగాక ఈ చిత్రం లవ్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ఉంటుందని కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి చూడాలని కోరారు.

Advertisement

అయితే వాలెంటెన్స్ డే కానుకగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే నలుగురు హీరోయిన్లు ఉన్నటువంటి ఈ చిత్రం ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.అంతేకాక యూఎస్ లో మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు