ఓ రహస్య ప్రదేశంలో అరుదైన తెల్ల తోక గద్దలు

ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులను మనం చూసే ఉంటాం.కానీ మీరు చాడాని మరోకంటి ఉందండి.

 Rare White Tailed Hawks In A Secret Place , United Kingdom, Royal Society Of Sco-TeluguStop.com

ఆ పక్షీ చాలా అరుదైన పక్షీ.తెల్ల తోక గద్దలు ఓ రకం.గద్దల్లో చాలా జాతులకు చెందినవి అంతరించే దశలో ఉన్నాయి.ఇవి మన దేశంలో కనిపించే గద్దల లాగానే ఉంటాయి.కాకపోతే… తోక మాత్రం కొద్దిగా తెల్లగా ఉంటుంది.అందుకే వీటిని ఆ పేరుతో పిలుస్తున్నారు.

వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తూ… వీటి గూడు ఉన్నచోట ఓ రహస్య కెమెరాను సెట్ చేశారు.దాంతో అక్కడ రెండు గుడ్లు పెట్టిన గద్దలు వాటిని పొదిగాయి.

వాటిలో ఒక గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చింది.యునైటెడ్ కింగ్‌డమ్ లో ఇలా గద్ద పిల్లను వీడియో రికార్డ్ చేయడం ఇదే తొలిసారి అంటున్నారు.

పక్షుల సంరక్షణకు కృషి చేస్తున్న స్కాట్‌లాండ్‌లోని రాయల్ సొసైటీ లోని అబెర్నాతీ సెంటర్‌లో ఏప్రిల్ 8, 2022 శుక్రవారం రాత్రి 7.43కి గద్ద పిల్లను చూసినట్లు తెలిపారు.ఆ పక్షి గూడును వారే ఏర్పాటు చేశారు.ప్రజలకు తెలియకుండా… రహస్య ప్రాంతంలో ఏర్పాటు చేశారు.అందువల్ల పక్షులు తమకు ఏ ఆపదా లేదని భావించి… ఆ గూట్లో ఉండేందుకు సిద్ధపడ్డాయి.వారి ప్రయత్నాలతో ఇప్పుడు రెండు గుడ్లలో ఒకటి పిల్లగా మారింది.

ఈ పక్షి గూడు ఉన్నచోట రోజూ మంచు కురుస్తోంది.మంచు తుఫాన్లు కామన్‌గా వస్తున్నాయి.అలాంటి చోట ఆ పక్షులు ఎంతో జాగ్రత్తగా గుడ్లను పొదుగుతున్నాయి.ఆ గూటికి 3 మీటర్ల దూరంలోనే ఓ కర్ర లోపల కెమెరాను ఏర్పాటు చేశారు.

ఆ వీడియో స్ట్రీమింగ్‌ని రోజూ లోచ్ గార్టెన్ నేచర్ సెంటర్‌లో చూస్తున్నారు.

Telugu Garden Nature, Rarewhite, Royalsociety, Kingdom-Latest News - Telugu

ఈ వీడియో చూసి నెటిజన్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అంతరించిపోయే జాతి పక్షులకు పిల్ల పుట్టడం గొప్ప విషయం అంటున్నారు.ఇదో అద్భుతమైన విజయం.

అవి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాయని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా ఫీడ్ బాగా చూపించారు.ఇంకా వైడ్ యాంగిల్ చూపిస్తే బాగుండేది.

ఫ్యూచర్‌లో అలా చేస్తారని ఆశిస్తున్నానని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.తెల్ల తోక గద్దలు… సముద్ర గద్దల జాతికి చెందినవి.

ఇవి యూరప్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.ఇవి చాలా పెద్ద పక్షులు.1918లో చివరిసారిగా స్కాట్‌లాండ్ ఈ పక్షిని చూసింది.ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube