దసరా రోజు అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్న బోయపాటి.. గెట్ రెడీ!

యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను.ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

 Rapo 20 Movie Mekars Updates To Be Out On Dussehra, Dussehra, Boyapati Srinu , R-TeluguStop.com

ఇక ఇటీవలే బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా తీసి ఘన విజయం అందుకుని మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా ప్రకటించాడు.

రామ్ పోతినేని ఎనర్జీ బోయపాటి యాక్షన్ తో మిక్స్ అయితే ఇక అదిరిపోయే మాస్ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది.అందుకే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.

రామ్ అయితే తన ఆశలన్నీ బోయపాటి మీదనే పెట్టుకున్నాడు.ఎందుకంటే ఇటీవలే రామ్ లింగుస్వామి దర్శకత్వంలో చేసిన ‘ది వారియర్‘ సినిమా విజయం సాధించలేదు.

దీంతో ఇప్పుడు బోయపాటి సినిమాతో భారీ విజయం సాదించాలని ఆశ పడుతున్నాడు.

Telugu Rapo, Boyapatiram, Boyapati Srinu, Dussehra, Ram Pothineni, Rapomekars, T

అందులోను ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ఫుల్ ఫోకస్ పెట్టాడు.ఇక ఈ సినిమా నుండి దసరా కానుకగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఎదురు చూపులు ముగిసాయి.

ఇక మాసివ్ ఎనర్జిటిక్ కాంబోతో దసరా వేడుకలు స్టార్ట్ చేద్దాం.అక్టోబర్ 5న అప్డేట్ లు రాబోతున్నాయి.

గెట్ రెడీ అంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.మరి ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా టాక్ బయటకు వచ్చింది.అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది.

రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నాడు.మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube