రోజు రోజు కి వరుస అత్యాచారాలు పెట్రేగి పోతున్నాయి.ఎన్నో సంఘతనలు జరుగుతున్నా సరే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు కదా అనే నెపంతో మృగాళ్ళు రెచ్చి పోతున్నారు.మొన్న కథువాలో ఆసిఫా, నిన్న ఉన్నావ్ లో మరో నిర్భాగ్యురాలు నిన్నటికి నిన్న ఏపీలో లోని గుంటూరులో మరో తొమ్మిదేళ్ళ బాలిక మీద అఘాయిత్యం…ఈ కీచక పర్వాలు ఆగే పరిస్థితి కనపడటం లేదు…దాచేపల్లి లో తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన మరువకముందే

పశ్చిమగోదావరి జిల్లాలో మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.వివరాలోకి వెళ్తే.పశ్చిమ గోదావరి జిల్లా ,తణుకు మండలం తేతలి గ్రామంలో శుక్రవారం ఆరేళ్ళ బాలిక పై పదిహేనేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు…ఆ బాలుడికి మరో ముగ్గురు మైనర్ లు సహకరించడం తో అందరూ తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు.బాధిత బాలిక తేతలి గ్రామంలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ తణుకులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటోంది.
వేసవి సెలవులు కావడంతో బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో నలుగురు బాలురు కూడా అక్కడే ఆడుకుంటున్నారు.ఈ పాపని కూడా తమ ఆటలో కలుపుకున్న బాలురు కొద్దిసేపు ఆడుకొన్న తరువాత వారిలో ఒక బాలుడు, ఆ పాపని తన వెంట రమ్మన్నాడు…ఆటలో భాగం కదా అని అనుకుని వెళ్ళిన బాలికని.
ఆ బాలుడు సమీపంలోని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లాడు.వాడి వెంట ఉన్న ముగ్గురు పిల్లలు బయట కాపలా నిలబడ్డారు.
ఆ తరువాత
బాత్రూమ్‌లోంచి ఆ పాప ఏడ్చుకొంటూ బయటకు పరుగుపెట్టింది.ఇంటికొచ్చిన పాప తీరు ఇంట్లో వాళ్లను భయపెట్టింది.
దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.దాంతో పోలీసులు నలుగురు మైనర్‌లను అదుపులోకి తీసుకొని ఎందుకిలా చేశారని ఆ నలుగురు పిల్లలను అడిగితే ‘‘మేమే చేశాం సార్! సెల్‌ఫోన్‌లో, సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసి.
మాకు కూడా అలా చేయాలనిపించింది’’ అన్న ఆ బాలల తీరుకు పోలీసులు నివ్వెరపోయారు.ఏమి చేయాలో అర్ధం కాక వారిని జువైనల్ హోం కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.







