కొన్ని విషయాల గురించి కొంతమంది మాట్లాడకపోతేనే బాగుంటుంది, లేకపోతే వినడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి.పార్టీ మారిన నేతలను విమర్శించే క్రమంలో మంత్రి రోజా మాట్లాడుతున్నప్పుడు వెనక ఉన్న వల్లభనేని వంశీ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ హల్చల్ చేసింది.
పార్టీ మారిన నేతల ను వెనకనే పెట్టుకుని పార్టీ మారడం గురించి వో రేంజ్ లో లెక్చర్ దంచిన రోజా గారి స్పీచ్ నవ్వుల పాలయ్యింది.ఇప్పుడు పార్టీ మారిన నేతల గురించి డబ్బు కు అమ్ముడు పోవడం గురుంచి జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక నేత అయిన రాపాక వరప్రసాద్ గారు( Rapaka Varaprasad ) మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది .

జనసేన ( Janasena )నుంచి గెలిచిన రెండు నెలల్లోనే జగన్ ( Jagan ) పంచన చేరి వైసిపి అనధికారకనేత గా కొనసాగుతున్న చరిత్ర రాపాక వరప్రసాది ది … కనీసం ఆ పార్టీకి రిజైన్ చేసి ఈ పార్టీలో జాయిన్ అయి ఉన్నా కూడా ఆయన మాటలకి ఎంతో కొంత విలువ ఉండేది … టెక్నికల్గా ఇప్పటికీ ఆయన జనసేన ఎమ్మెల్యేనే .జనసేన నుండి గెలిచి జగన్ కి పాలభిషేకాలు చేసిన చరిత్ర ఆయనది.జనసేన నుండి జగన్ ప్రభుత్వానికి అనుకూలం గా మారడానికి ఆయనకు ఏ ప్రతిపలం దక్కిందో తెలియదు గాని ఇప్పుడు ఆయన డబ్బులకి రాజకీయ నాయకులు అమ్ముడుపోతున్నారంటూ మాట్లాడటం నైతికంగా ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆయనకే తెలియాలి.

ఎమ్మెల్సీ ఎన్నికలలో పది కోట్లు తనకు ఆశపెట్టారని తన మిత్రుడు ద్వారా తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారని, అసెంబ్లీలో కూడా తనతో ఈ విషయమై చర్చించారని అయితే రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యమని ,సిగ్గు శరం లేకుండా అలాంటి డబ్బులు నేను తీసుకొలేను అని అందుకే నేను తెలుగుదేశం ఆఫర్ ను రిజెక్ట్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు.రాజకీయాల్లో విలువలు ఉండటం చాలా ముఖ్యం అధికారం ఉన్న లేకపోయినా ఆ నాయకుడు కున్న విలువలు కారణంగానే రాజకీయాల్లో ఎదుగుదల ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే.అయితే రాపాక లాంటి నాయకుడు పార్టీ మారడం లాంటి విషయాలు గురించి ఇలాంటి వాఖ్యలు చేయడం కొంత వినడానికి ఇబ్బందిగా ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు
.






