కొన్ని కొన్నిసార్లు మనకు కొన్ని వింత సంఘటనలు, ఫన్నీ సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి.వాటివల్ల మనము కూడా కాసేపు సరదాగా ఫీల్ అవుతుంటాము.
ఇలాంటి సరదాలు ఎక్కువగా బయట జరుగుతూ ఉంటాయి.ముఖ్యంగా రోడ్లపై ఎక్కువగా జరుగుతుంటాయి.
రోడ్లపై మన ముందు ప్రయాణించే వాహనాలను బాగా గమనిస్తే వాటి వెనకాల కొన్ని కొటేషన్లు భలే గమ్మత్తుగా ఉంటాయి.
అందులో ఎక్కువగా ఆటోలపై, లారీల పై, బైకులపై కనిపిస్తుంటాయి.
ఆ వాహన యజమానులు తమకు నచ్చినట్లుగా కొటేషన్స్ పెట్టించుకుంటారు.ఇక కొందరు భారీ భారీ డైలాగులు, ఫన్నీ కొటేషన్లు వేయించుకుంటారు.
ఇక ఇవి పొరపాటున ఎవరైనా కంటికి చిక్కితే చాలు వెంటనే వాటిని కెమెరాలో బంధించి నెట్టింట్లో వైరల్ చేస్తూ ఉంటారు.
ఇప్పటికే ఇలాంటివి నెట్టింట్లో చాలానే వచ్చాయి.
అలా తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రానా కూడా అటువంటి ఫోటోను ఒకటి పంచుకున్నాడు.ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
రానా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే.అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలు కాకుండా ఇతర విషయాలు కూడా పంచుకుంటాడు.
అలా తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫోటోను పంచుకున్నాడు.అందులో రోడ్డుపై ఒక ఆటో ప్రయాణిస్తున్నట్లు ఉంది.దీంతో ఈ ఫోటోను స్వయంగా రానా నే తీసినట్లు అనిపిస్తుంది.తాను కూడా ప్రయాణం లో ఉండగా తన ఎదుట ప్రయాణిస్తున్న ఆటోను ఫోటో తీసినట్లుగా తెలుస్తుంది.
ఇక ఆటోకు వెనకాల రేంజ్ రోవర్ అని వేయించుకున్నాడు ఆటో డ్రైవర్.
దీంతో ఆ ఫోటో ను రానా పంచుకుంటూ దానికి ఒక కొటేషన్ కూడా ఇచ్చాడు.
ఎక్కడైతే సంకల్పం ఉంటుందో వాళ్ళు అదే చేసి నమ్మించి చూపిస్తారు అని పంచుకున్నాడు.ఇక దీనికి ఎంతో మంది లైకులు కొట్టగా మరికొంతమంది మధ్యతరగతి రేంజ్ రోవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక రానా తొలిసారిగా లీడర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు.కానీ తనకంటూ గుర్తింపు మాత్రం టాలీవుడ్ లోని సంపాదించుకున్నాడు.లీడర్ సినిమా తర్వాత నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుమ్, రుద్రమదేవి, బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
గత ఏడాది ఆరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఎందుకో అంతగా సక్సెస్ కాలేదు.ఇక ప్రస్తుతం విరాట పర్వం సినిమాలో బిజీగా ఉన్నాడు.అంతేకాకుండా తాను గతంలో నటించిన 1945 సినిమా కూడా ఈ ఏడాది విడుదల కానుంది.
ఇక వీటితో పాటు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు రానా.