పుట్టబోయే బిడ్డ కోసం విదేశాల్లో షాపింగ్ చేస్తున్న రణబీర్ కపూర్.. నెటిజన్స్ ట్రోల్స్!

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.అయితే ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు.

 Ranbir Kapoor Shopping Abroad For An Unborn Baby Details, Ranbir Kapoor, Shoppi-TeluguStop.com

అయితే ఈ జంట నుండి ఇంత త్వరగా ఇలాంటి ప్రకటన వస్తుంది అని అభిమానులు ఊహించలేకపోయారు.ప్రస్తుతం హీరోయిన్ గా ఆలియా భట్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటువంటి సమయంలో ఆమె తల్లి కాబోతున్నట్టు వార్తలు వినిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఆలియా భట్ కి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఇటీవలే ఆర్ఆర్ఆర్ ఈ సినిమాతో ప్రేక్షకులకు చేరువ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వినిపించాయి.

కానీ తాజాగా ఆమె గర్భవతి అని తెలియడంతో ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటించడం లేదు అని క్లారిటీ వచ్చేసింది.రణబీర్ కపూర్ షంషేరా, బ్రహ్మస్త్ర సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంటూనే మరొకవైపు సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నారు.

కాగా వరుసగా సినిమాల్లో నటిస్తున్న రణబీర్ కపూర్ ప్రస్తుతం స్పెయిన్ లో ఒక సినిమా షూటింగ్ కోసం ఉన్నాడు.

Telugu Alia Bhatt, Bollywood, Brahmastra, Born Baby, Ranbir Kapoor, Ranbirkapoor

అక్కడ షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు తన సంతోషాన్ని స్నేహితులతో షేర్ చేసుకుంటున్నాడట.తాజాగా తన పుట్టబోయే బేబీ కోసం అక్కడ షాపింగ్ కూడా చేశాడట.న్యూ బార్న్ బేబీ కోసం డ్రస్ లు ఇంకా బాడీ నీడ్స్ ను కొనుగోలు చేశాడంటూ రణబీర్ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు.

రణబీర్ కపూర్ తండ్రి కాబోతున్నాడు అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఎగ్జైట్ తో ఎదురు చూస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube