కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఎనిమల్’ చిత్రం( Animal Movie ) మరి కొద్దీ గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనం గా విడుదల కాబోతుంది.ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ వారం రోజుల ముందే ప్రారంభం అయ్యింది.
విచిత్రం ఏమిటంటే రణబీర్ కపూర్( Ranbir Kapoor ) లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ కి బాలీవుడ్ లో కంటే ఎక్కువగా టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడమే.
సందీప్ వంగ కి ( Sandeep Vanga ) ఇక్కడ మంచి క్రేజ్ ఉండడం తో పాటుగా, ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమాకి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయని అంటున్నారు.
టాక్ బాగుంటే కచ్చితంగా ఈ సినిమా కూడా మరో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాగా నిలుస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ దుబాయి లో( Dubai ) పూర్తి అయ్యింది.
ఈ షో నుండి వస్తున్నా రెస్పాన్స్ చూస్తూ ఉంటే ఈ చిత్రం కేవలం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రమే కాదు, ఒక పాత్ బ్రేకింగ్ మూవీ గా నిలుస్తుందని అంటున్నారు.
అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy ) చూసినప్పుడు కచ్చితంగా ప్రతీ ఒక్కరికి క్లాసిక్ సినిమాని చూసాం అనే ఫీలింగ్ ని తెప్పించాడు.ఈ చిత్రం చూసిన తర్వాత అంతకంటే గొప్ప ఫీలింగ్ కలుగుతుందట.తండ్రీ కొడుకుల సంబంధం మధ్య ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎన్నో వందల సినిమాలు వచ్చాయి.
కానీ ఇలాంటి కోణం ఉన్న సినిమా మాత్రం ఇప్పటి వరకు రాలేదని అంటున్నారు.ప్రపంచం లో ఏ కొడుకు కూడా తన తండ్రిని ఇంతలా ప్రేమించలేడు అనే విధంగా రణబీర్ కపూర్ క్యారక్టర్ ని డిజైన్ చేసాడట సందీప్.
ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారక్టర్ బిల్డింగ్ పై శ్రద్ద పెట్టిన సందీప్, ఇంటర్వెల్ సన్నివేశం తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించేలా చేసాడట.అక్కడి నుండి క్లైమాక్స్ వరకు తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ ని పీక్ రేంజ్ లో చూపించాడట.సినిమా రన్ టైం మూడు గంటలకు పైనే ఉంది, కానీ సినిమా చూసిన తర్వాత అప్పుడే అయిపోయిందా, ఇంకా కాసేపు ఉంటే బాగుండును కదా అనే రేంజ్ లో ఉందట సినిమా.చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ అద్భుతాలు సృష్టించబోతోంది అనేది.