అరణ్యలోకి వెళ్లేది అప్పుడే అంటోన్న రానా

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఎంతటి పేరు సంపాదించుకున్నాడో భళ్లాలదేవుడి పాత్రలో నటించిన రానా దగ్గుబాటి కూడా అంతే పేరు సంపాదించుకున్నాడు.ఆయన ఈ పాత్రతో ప్రేక్షకుల్లో ఎక్కడలేని గుర్తింపును సాధించుకున్నాడు.

 Rana Daggubati Haathi Mere Saathi Release Date Fixed-TeluguStop.com

ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపును సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నాడు.కాగా ప్రస్తుతం రానా దగ్గుబాటి చేస్తున్న సినిమా హాతీ మేరే సాతి రిలీజ్‌కు రెడీ అవుతోంది.

బాలీవుడ్‌లో గతంలో వచ్చిన హాతీ మేరే సాతీ టైటిల్‌ను వాడుకోవడమే కాకుండా సినిమా కూడా ఏనుగుల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే జనాలను ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

హాతీ మరే సాతీ చిత్రాన్ని ప్రభు సోలోమాన్ డైరెక్ట్ చేస్తుండగా పలువురు బాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను తెలుగులో అరణ్య అనే పేరుతో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube