టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి గురించి అందరికీ పరిచయమే.రామానాయుడు మనవడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తొలి సినిమా లీడర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన రానా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు.
ఇక హీరో రోల్స్ లో అంతగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిన కూడా నెగెటివ్ రోల్స్ కి శ్రీకారం చుట్టి తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా స్టన్ అయ్యేలా చేసాడు రానా.
అలా బాహుబలి, బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో రానా చేసిన నెగిటివ్ రోల్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాలో రానా విలన్ గా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
అలా చాలా వరకి రా నాకు నెగటివ్ పాత్రలే వస్తున్నాయి.ఇక రానా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.
ఇదంతా పక్కన పెడితే రానా భార్య మిహికా బజాజ్ గురించి మనందరికీ తెలిసిందే.గతంలో రానా మిహీకా బజాజ్ ను కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.

ఇక పెళ్లి తర్వాత ఈ జంట చూడముచ్చటగా అందరి దృష్టిలో పడింది.రానా భార్య మిహికా కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది.రానా కూడా తమ ఫ్యామిలీ ఫోటోలను బాగా పంచుకుంటాడు.
గతంలో మిహికా ప్రెగ్నెంట్ అని పుకార్లు రాగా వెంటనే వాటికి చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా గతంలో రానా, మిహికా విడాకులు తీసుకుంటున్నారు అని బాగా వార్తలు వినిపించడం అందులో కొంత.
రానా కొంతకాలం సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకొని తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను కూడా డిలీట్ చేయటంతో మీరు నిజంగానే బ్రేకప్ తీసుకున్నారు అని అందుకే ఫోటోలు కూడా డిలీట్ చేశారు అని బాగా పుకార్లు వచ్చాయి.కానీ మిహికా.
రానా తో దిగిన కొన్ని ఫోటోలను లవ్ సింబల్ జత చేసి పంచుకోగా వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు అని క్లారిటీ వచ్చింది.

అయితే ఇంతకాలం వీరి గురించి ఈ విధంగా చర్చించగా ఇప్పుడు.ఈ జంట మరో గుడ్ న్యూస్ వినిపించారు అని.త్వరలో తల్లితండ్రులు కాబోతున్నారు అని అంటున్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.మీహికా మాత్రం ప్రెగ్నెంట్ అని.త్వరలోనే ఈ విషయంను తమ అభిమానులకు షేర్ చేయనున్నారని టాలీవుడ్ లో బాగా టాక్ వస్తుంది.మరి ఈ విషయం గురించి రానా దంపతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ఇక రానా ప్రస్తుతం ఓ ప్రాజెక్టులో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.







