చిరంజీవి ఆచార్య చిత్రం అన్ని అనుకున్నట్లుగా జరిగితే షూటింగ్ పూర్తి అయ్యి వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ నిలిచి పోయింది.
సినిమాకు సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను రామ్ చరణ్‌ను కొరటాల శివ భావించాడు.
చరణ్ ఓకే చెప్పడంతో పాత్ర పరిధి ఇంకాస్త పెంచాడు.హీరోయిన్ మరియు సాంగ్‌ను కూడా పెట్టాడు.
కరోనా కారణంగా ప్లానింగ్ అంతా తారు మారు అయ్యింది.చరణ్ వెంటనే ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో జాయిన్ కావాల్సి ఉంది.ఆచార్య చిత్రం ఎప్పటికి ప్రారంభం అయ్యేది తెలియని పరిస్థితి.రెండు సినిమాలకు డేట్లు క్లాష్ అయ్యే అవకాశం ఉంది.
అందుకే సినిమా నుండి తప్పుకోవడం ఉత్తమంగా భావించాడు.తానే ఒక నిర్మాత అయినా కూడా తాను నటిస్తే మంచి క్రేజ్ వస్తుందని తెలిసినా కూడా చరణ్ తప్పుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాడు.

రామ్ చరణ్ తప్పుకోవడంతో ఆ పాత్రకు గాను రానాను సంప్రదిస్తున్నారట.ఆ పాత్ర కాస్త తగ్గించి రెండు వారాల పాటు రానా డేట్లు కావాలంటూ కొరటాల శివ అండ్ టీం అడిగారట.అందుకు రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఆచార్య చిత్రంలో అనడంతో మరో ఆలోచన లేకుండా రానా ఓకే చెప్పాడంటూ సమాచారం అందుతోంది.ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.రానా ఆచార్యలో నటించడం కూడా మంచి హైప్‌ను తీసుకు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.