రానా( Hero Rana ) హీరోగా తేజ ( Director Teja ) దర్శకత్వం లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా( Nene Raju Nene Mantri movie ) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.తేజ దాదాపు దశాబ్ద కాలం తర్వాత సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఇక పై మళ్లీ ఆయన జోరు కంటిన్యూ చేస్తాడని అంతా భావించారు.
కానీ నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత మళ్లీ తేజ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లుగానే ఉంది.తాజాగా ఆయన రానా తమ్ముడు అభిరామ్ తో అహింస అనే సినిమా( Ahimsa movie ) ను రూపొందించిన విషయం తెల్సిందే.
ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.ఇలాంటి సినిమాలను ఇంకా ఎవరు చూస్తారు అంటూ తేజ పై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
అయినా సురేష్ బాబు గారు ఈ సినిమా కథ కు ఎలా ఓకే చెప్పారు అని కొందరు అసహనం వ్యక్తం చేశారు.

దగ్గుబాటి ఫ్యామిలీకి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదేమో అందుకే అహింస సినిమా ను చేస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదేమో అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు.ఈ నేపథ్యంలో రానా తో తేజ సినిమా గురించి కూడా చర్చ జరుగుతోంది.అహింస సినిమా ప్రమోషన్ సమయంలోనే రానా తో సినిమా ఉంటుంది అంటూ ప్రకటన వచ్చింది.

రానా మరియు తేజ కాంబోలో రాక్షస రాజు రావణాసుర అనే టైటిల్ తో సినిమా రాబోతుంది అంటూ ప్రకటన వచ్చింది.కానీ తాజాగా ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు తేజ కథ మరియు స్క్రిప్ట్ విషయంలో రానా మరియు సురేష్ బాబు ఇతర దగ్గుబాటి కాంపౌండ్ కు చెందిన రచయితలను సంతృప్తి పరిచితేనే సినిమా పట్టాలు ఎక్కేది.కనుక ఇప్పట్లో రాక్షస రాజు రావణాసుర సినిమా పట్టాలు ఎక్కేది అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి తేజ కొత్త సినిమా మొదలు పెట్టాలంటే చాలా కాలం వెయిట్ చేయాలేమో.
