అవును, మీరు విన్నది నిజమే.ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆ సోదరి పెద్ద కంపెనీలో జాబ్ పొందడమే కాకుండా కళ్లు చెదిరే ప్యాకేజీని సొంతం చేసుకొంది.
మనలో చాలామందికి అన్ని సౌకర్యాలు ఉండి, పెద్ద పెద్ద కాలేజ్ లలో చదివించినా కూడా కనీసం చదవడానికి ఒళ్ళు వంగదు.ఇంకా వుద్యోగం అంటే ఇంకా చెప్పాలా? అదేదో అందని ద్రాక్షలాగా ఫీల్ అయ్యేవారు ఎందరో వున్నారు.వారిలో తప్పు పెట్టుకొని ఎదుటువారిని నిందిస్తూ వుంటారు.కానీ ఆమె ఆ కేటగిరికి చెందినది కాదు, అత్యంత సాధారణ జీవనం కొనసాగిస్తూ ఎవ్వరూ సాధించలేని ఫీట్ సాధించింది.
ఆమె మరెవరో కాదు, తమిళనాడులోని( Tamil Nadu ) ఒక చిన్న రైతు కుటుంబానికి చెందిన ఆర్ రమ్య.( R Ramya ) ఆ యువతి ఓ సింగపూర్ కంపెనీ గ్రూప్లో భారీ ఉద్యోగ ఆఫర్ పొందింది.ఈ స్టూడెంట్ ఐఐఎం సంబల్పూర్ ప్లేస్మెంట్లో రూ.64.15 లక్షల ప్యాకేజీకి ఎంపిక కావడం ఇపుడు స్థానికంగా హాట్ టిపిక్ అయింది.ప్రతిష్ఠాత్మకమైన తోలారం గ్రూప్ రమ్య సామర్థ్యాన్ని గుర్తించి, ఆమెకు తగిన ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా రమ్యకు నైజీరియాలో పనిచేసే అవకాశాన్ని కూడా కల్పించింది.
ఒక చిన్న కుగ్రామం నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగిన ఆమె ప్రస్థానాన్ని చూసి ఆమెకి చదువు చెప్పిన టీచర్లు ఆమెని చూసి గర్వపడుతున్నారు.22 ఏళ్ల రమ్య తమిళనాడులోని సేలం జిల్లాలో( Selam ) పుట్టి పెరిగింది.ఆమె అద్భుతమైన మేనేజ్మెంట్, అనలైటికల్ స్కిల్స్ కారణంగా అత్యంత కష్టమైన 5-6 రౌండ్ల ఇంటర్వ్యూలు పాస్ అయ్యి ఈ ఆఫర్ పొందింది.
ఓ ఇంటర్వ్యూలో రమ్య మాట్లాడుతూ.తమ గ్రామంలోని మహిళలు సాధారణంగా చదువుల కోసం బయటకు వెళ్లరని, అయితే తనలాంటి మహిళలు ఉన్నత చదువులు చదివేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు.