తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి రమ్యకృష్ణ(Ramya Krishna)ఒకరు ఈమె ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు.ఇలా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి రమ్యకృష్ణ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు.
అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశారు.

ఈ విధంగా రమ్యకృష్ణ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే డైరెక్టర్ కృష్ణ వంశీని (Krishna Vamshi) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.ఈ విధంగా రమ్యకృష్ణ హీరోయిన్ గాను కొనసాగుతూ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే పలు సినిమాలలో తల్లి అత్త పాత్రలలో నటిస్తూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.
ఈ విధంగా గత మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె ఎంత మేరా ఆస్తులు సంపాదించారనే విషయం గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.

రమ్యకృష్ణ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఒక్కో సినిమాకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ( Remuneration ) తీసుకునే వారట ఇలా ఈమె సినిమాలలో నటిస్తూనే ఇప్పటివరకు సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తుంది.ఇలా రమ్యకృష్ణ మాత్రమే సినిమాలలో నటిస్తూ 100 కోట్ల వరకు సంపాదించారు.ఇక తన భర్త కృష్ణ వంశీ ఆస్తిపాస్తులు కూడా భారీగానే ఉన్నాయని తెలుస్తుంది.
ఇక ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ ఒక రోజు కాల్ షీట్ కోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.