తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi ) ఒకరు.అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినటువంటి ఈమె వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా లావణ్య బిజీగా మారిపోయారు.ఇదిలా ఉండగా ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej )తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.
ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు.

జూన్ 20వ తేదీ ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు.ఇలా త్వరలోనే లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు.ఈ క్రమంలోనే అల్లు శిరీష్ ( Allu Sirish ) లావణ్య త్రిపాఠి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో అల్లు శిరీష్ లావణ్య త్రిపాటి శ్రీరస్తు శుభమస్తు ( Srirasthu Subamasthu )అనే సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు ముందు వీరిద్దరూ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.ఇలా ఒక ఇంటర్వ్యూలో భాగంగా వీరిద్దరూ పాల్గొనగా లావణ్య త్రిపాఠి గురించి అల్లు శిరీష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లావణ్య త్రిపాఠి ఒక మంచి హౌస్ వైఫ్( Good House Wife ) అవుతుందని తెలిపారు.తను వంటలు బాగా చేస్తుందని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ఎంతో సహనంతో చాలా మంచిగా చూసుకుంటుందని, తనకు ఓపిక చాలా ఎక్కువ అంటూ లావణ్య త్రిపాఠి గురించి శిరీష్ ఎంతో గొప్పగా చెబుతూ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.







