ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి( Margadarsi Chit Fund ) వ్యవహారం హాట్ డిబేట్ గా మారింది… దశాబ్దాల తరబడి మీడియా మొగల్ గా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న రామోజీరావు ( Ramoji Rao )మార్గదర్శి వ్యవహారాల్లో మాత్రం చట్టపరంగా కొన్ని ఇబ్బందులను గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు….ఫైనాన్స్ బిజినెస్ కావడం వల్ల చట్టపరంగా పాటించాల్సిన కొన్ని విధానాలను పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చినటుగా తెలుస్తుంది .
అయితే మీడియా అధిపతిగా దశాబ్దాలు అనుభవం ఉన్న ఆయనకు దేశంలో తెలియని రాజకీయ నాయకుడు లేడు….ప్రఖ్యాత మీడియా సంస్థ అయినందున రాజకీయ పార్టీలు కూడా ఆయనతో మంచి సంబంధాలు నడపడానికి ప్రయత్నిస్తాయి .

అందుకే కేంద్ర స్థాయి నాయకులు కూడా ఆయన ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరుపుతారు ….కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా తనకు అనుకూలంగా పనులు చక్కబెట్టుకోగల నేర్పు ఆయన…సొంతం జగన్మోహన్ రెడ్డి తో తప్ప ఆయనతో సత్సంబంధాలు లేని రాజకీయ నేత లేడు అంటే కూడా అతిశయోక్తి కాదు.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి కావడంతో ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవని వార్తలు వస్తున్నాయి …… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన పార్టీ మీద తన ప్రవర్తన మీద విపరీతమైన విమర్శలు చేసి వ్యతిరేక వార్తలు రాసిన రామోజీరావు ను జగన్ కూడా అంత తేలిక వదలడని , అంది వచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులా ఉపయోగించుకుంటాడాని వార్తలు వస్తునాయి.మార్గదర్శి వ్యవహారంలో తప్పు రామోజీ వైపే ఉండటంతో ఆయనకు శిక్ష పడే వరకు వదలకూడదని పట్టుదల జగన్లో కనిపిస్తుందని విశ్లేషణలు వినిపిస్తునాయి .

మార్గదర్శి వ్యవహారంలో టిడిపి అనుకూలం మీడియా తప్ప మిగతా మీడియా మౌనంగానే ఉంది జరుగుతున్న తతంగా నిశ్శబ్దంగా గమనిస్తున్నాయి….చట్టంతో ముడిపడిన విషయము అయినందున , మీడియాపై దాడి అని కూడా చెప్పలేని పరిస్థితి .రామోజీ ఫిలిం సిటీ( Ramoji Film City ) ని లక్ష నాగళ్ళతో దున్నిస్థానాని ఎన్నికల ముందు హోంకరించిన కేసీఆర్ లాంటి నేతను సైతం తన చాకచక్యంతో మంచి చేసుకుని పరిస్థితులను చక్కబెట్టుకున్న రామోజీకి జగన్ వ్యవహారం మాత్రం మింగుడు పడటం లేదని……జగన్ ముందు తన పరిచయాలు గాని కేంద్రంతో తనకున్న సంబంధాలుగాని పని చేయకపోవడం రామోజీకి చాలా ఇబ్బందిగా మారింది అని చెబుతున్నారు వయసు మీద పడడంతో ఇంతకుముందులో ఆయన తన ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారని ,చట్టంతో ముడిపడిన అంశం కావడంతో ఆయన రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకోలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి .