ప్రపంచం లేడీ విలన్‌ను చూడబోతుందంటూ వర్మ ట్వీట్‌

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అమెరికా వంటి అగ్రరాజ్యంను కూడా లెక్క చేయకుండా నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను.

 Ramgopal Varma Tweet About Kim Jong Un Sister Kim Dynasty. Ramgopalvarma, Tollyw-TeluguStop.com

ప్రపంచ దేశాలతో నాకు సంబంధం లేదు, నేను నా దేశంకు అధినేతను, నా దేశ ప్రజలు నన్ను దేవుడిగా పూజించాలి అంటూ రూల్స్‌ పాస్‌ చేసిన అత్యంత దారుణమైన నియంత ఆయన.ప్రపంచంలో అత్యంత కఠినాత్ముడిగా ఆయనకు పేరుంది.అలాంటి కిమ్‌ ప్రస్తుతం అనారోగ్యంతో చావు బతుకుల మద్య పోరాడుతున్నాడు.

ఈ సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించాడు.కిమ్‌ అనారోగ్యంతో మరణిస్తే ఆయన సోదరి కిమ్‌ డైనస్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంది అంటున్నారు. నాకు తెలిసిన దాని ప్రకారం కిమ్‌ కంటే అత్యంత కఠినాత్మురాలు ఆమె. గతంలో కిమ్‌ తీసుకున్న పలు నిర్ణయాల వెనుక డైనస్టీ ఉందనే రూమర్‌ ఉంది.ఒకవేళ కిమ్‌ చనిపోతే డైనస్టీ ప్రపంచం ఒక కొత్త విలన్‌ను చూడబోతుందని అన్నాడు.

Telugu Kim Dynasty, Kim Jong, National, Ramgopalvarma, Tollywood, Uttarkorea-Gen

ఇప్పటి వరకు జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో విలన్‌లను చూశాం. కాని మొదటి సారి ఒక రియల్‌ విలన్‌ను మనం డైనస్టీ రూపంలో చూడబోతున్నాం అంటూ వర్మ కామెంట్‌ చేశాడు. అంతర్జాతీయ మీడియాల్లో వస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం చైనా డాక్టర్లు కిమ్‌ కు చికిత్స అందిస్తున్నారు. ఆయన చెడు అలవాట్ల కారణంగా ఆయన మృత్యు ఒడికి చేరబోతున్నాడు అంటూ కొందరు అంటున్నారు.

కాని అసలేం జరుగుతుంది అనేది మాత్రం ఉత్తర కొరియా అధికారికంగా చెప్పడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube