అక్టోబర్ 2న ‘సైరా’ చిత్రం విడుదల కాబోతుంది అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.చరణ్ మరియు చిరంజీవిల నోటి నుండి కూడా ఆ డేట్ ప్రస్తావన వచ్చింది.
గాంధీ జయంతి రోజున ఒక స్వాతంత్య్ర సమరయోధుడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమద్య గొప్పగా ప్రకటించారు.అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌కు చెందిన ఒక పీఆర్ స్వయంగా సైరా సినిమా విడుదల వారం వాయిదా పడబోతుంది అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.ఆయన పోస్ట్‌తో అంతా గందరగోళం నెలకొంది.వార్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సైర సినిమాను అడ్డు తొలగించడం భావ్యంగా యూనిట్ సభ్యులు నిర్ణయానికి వచ్చారని అంతా అనుకున్నారు.తాజాగా ఆ విషయమై నిర్మాత చరణ్ స్పందించాడు.
సైరా విడుదల వాయిదా అంటూ వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు.

సైరా చిత్రం విడుదల వాయిదా విషయమై చరణ్ తాజాగా స్పందిస్తూ అవన్ని పుకార్లే అని, సినిమాను అనుకున్న సమయంకు ఖచ్చితంగా విడుదల చేస్తామంటూ ప్రకటించారు.అయితే సినిమా విడుదల విషయంలో చరణ్ ప్రకటన తర్వాత కూడా అనుమానాలు ఉన్నాయి.దసరా హాలీడేస్‌లో సినిమా విడుదల అయితే ఫలితం తేడా కొట్టినా మంచి వసూళ్లు నమోదు అవుతాయి.
అందుకే వారం వాయిదా వేసి దసరాకు విడుదల చేస్తేనే బాగుంటుందని అంతా అంటున్నారు.కనుక చరణ్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో చూడాలి.