సినిమాలను కూడా వదిలి పెట్టని ధోనీ

టీం ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఆటలతో పాటు వ్యాపారాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్న విషయం తెల్సిందే.పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండటంతో పాటు, కొన్ని గేమింగ్‌ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.

 Dhonientry Inbollywood Movies Tstop-TeluguStop.com

అందు కలడు ఇందు లేడు అన్నట్లుగా ఉంది ధోని పరిస్థితి.ఆయన ఇప్పటికే డజనుకు పైగా బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

అన్ని మార్గాల ద్వారా తన క్రేజ్‌ను వినియోగించుకుని డబ్బు చేస్తున్న ధోనీ త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Telugu Bollywood, Dhoni, Dhoni Bollywood, John Abraham-

ఇప్పటికే తన బయోపిక్‌ సినిమాగా తీసేందుకు అనుమతించడం ద్వారా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ధోనీ ఆ చిత్రంతో భారీ మొత్తంలో డబ్బు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక త్వరలో నేరుగా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.సినిమాల్లోకి అంటే ధోనీ నటించడం కాదు.

ధోని త్వరలోనే ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నాడు.బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహంతో కలిసి ధోనీ ప్రొడక్షన్‌ హౌస్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Bollywood, Dhoni, Dhoni Bollywood, John Abraham-

జాన్‌ అబ్రహం బాలీవుడ్‌లో స్టార్‌ హీరో.ఈయనతో ధోనీకి చాలా కాలంగా మంచి స్నేహితం ఉంది.అందుకే స్నేహితులు ఇద్దరు కలిసి వ్యాపారం చేసేందుకు సిద్దం అవుతున్నారు.అతి త్వరలోనే ఈ విషయమై అధికారికంగా ప్రకటన రాబోతుంది.ధోనీ ప్రొడక్షన్స్‌లో చిన్న బడ్జెట్‌ కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు రాబోతున్నాయి.అలాగే వెబ్‌ సిరీస్‌లను కూడా నిర్మించే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

మొత్తానికి మహేంద్ర సింగ్‌ ధోనీ మరో కొత్త రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు.అది సినిమాలు అవ్వడంతో ఆయన అభిమానులు సంతోషంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube