తెలుగులో ఇటీవల విడుదల అయిన సీతారామం,కార్తికేయ-2 సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకుని ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలతో పాటుగా విడుదలైన బింబిసార సినిమా కూడా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయాన్ని నిరూపించాయి.
అంతేకాకుండా థియేటర్ లకు ప్రేక్షకులు రాలేదు అన్న భయాందోళనలను కూడా ఈ సినిమాలో తొలగించాయి.కాగా సీతారామం అలాగే కార్తికేయ 2 సినిమాలు ఇప్పటికీ అదే ఊపుతో దూసుకుపోతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా సీతారామం సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసిస్తూ ఒక లేఖను కూడా రాశారు.ఆ లేఖలో మెగాస్టార్ ఈ విధంగా రాసుకొచ్చారు.సీతారామం చూసాను.చక్కటి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి ముఖ్యంగా ఎంతో భిన్నమైన స్ర్కీన్ ప్లే తో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతగానో నచ్చింది.
అంతే కాకుండా మనసుల పై చెరగని ముద్ర వేసే ఇలాంటి ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వీనీదత్ గారికి,స్వప్నదత్, అలాగే ప్రియాంక దత్ లకు ఫ్యాషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి శుభాకాంక్షలు.ఇక ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్న.

ఈ సినిమాకి మరెన్నో అవార్డులు,రివార్డులు జాతీయ స్థాయిలో గెలవాలని మనస్ఫూర్తిగా అభిలాషిస్తున్నాను అని రాసుకొచ్చాడు చిరు.ఇక మెగాస్టార్ చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కార్తికేయ 2 సినిమాని మెచ్చుకుంటూ మంచ మంచి సినిమాలకి ఎప్పుడూ ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు.కార్తికేయ 2 టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు చెర్రీ.ఇకపోతే ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రెటీలు ఈ సినిమాపై, ఈ సినిమా టీమ్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
తాజాగా మెగా అభినందనలు సినిమాకు మరింత హైప్ ని తీసుకొస్తున్నాయి.








