బాలీవుడ్ లో మరో రామాయణం.. రావణుని పాత్రలో కేజీఎఫ్ హీరో నటిస్తాడంటూ?

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్( Prabhas, Kriti Sanon ) కలిసి నటించిన తాజాగా ఆదిపురుష్.ఎన్నో నెగటివ్ కామెంట్స్ ని విమర్శలను ఎదుర్కొన్న తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 16న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

 Ramayana Biggest Project On Cards Yash Play Ravana Ranbir Kapoor Alia Will Palay-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ ఆదిపురుష్ కంటే ముందు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మంతెనలతో కలిసి మరోసారి రామాయణ గాథను భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రానికి దంగల్ ఫేం నితీశ్ తివారీ( Nitish Tiwari ), మామ్ ఫేం రవి ఉద్యవార్‌లు( Ravi Udyavars ) దర్శకత్వం వహించనున్నారు.

మొదటి భాగాన్ని 2021లో విడుదల చేయనున్నట్టు అప్పట్లో ప్రకటించారు.ఆ తర్వాత ఈ చిత్రంలో రాముడు, రావాణాసురుడిగా ఎన్టీఆర్, రామ్ చరణ్, హృతిక్ రోషన్, మహేష్ బాబు స్టార్ నటుల పేర్లు వినిపించాయి.

ఆ తర్వాత ఈ చిత్రంపై ఎలాంటి ప్రకటన లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం అల్లు అరవింద్ త్రి విక్రమ్‌తో మాటలు రాయించారట.

ఇప్పటికే లాక్‌డౌన్‌లో రామాయణం సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ పూర్తి చేసినట్టు సమాచారం.

Telugu Bollywood, Ramayanabiggest, Ranbir Kapoor, Seetharama-Movie

అంతేకాదు ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ హీరోల కలయికలో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను( Ranbir Kapoor ) శ్రీరాముడి పాత్ర కోసం, సీతగా ఆమె ధర్మపత్ని ఆలియా పేరును ఫైనలైజ్ చేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరోవైపు కేజీఎఫ్ ఫేమ్ యశ్ లంకాధిపతి అయిన రావణాసురుడిగా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

ఈ రామాయణలో హిందీ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తే.కన్నడ సౌత్ ఇండస్ట్రీకి చెందిన యశ్ రావణాసురుడిగా యాక్ట్ చేయడం విశేషం.మొత్తంగా సౌత్, నార్త్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ పై అపుడే అంచనాలు మొదలయ్యాయి.

Telugu Bollywood, Ramayanabiggest, Ranbir Kapoor, Seetharama-Movie

దాదాపు రామయణంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా ఫైనలైజ్ అయినట్టు సమాచారం.ఇక రామాయణం లాంటి గాథకు ఎలాంటి పేటెంట్ హక్కులు లేవు.ఎవరైనా తెరకెక్కించవచ్చు.

పౌరాణిక, చారిత్రక కథలకు కాపీ రైట్ హక్కులు లాంటివి ఉండవు కాబట్టి ఎవరైనా ఈ కథతో సినిమాను తెరకెక్కించవచ్చు.మరి ప్రభాస్ అట్టహాసంగా రామాయణ కథపై ఆదిపురుషుడు శ్రీరామచంద్రుడిపై ’ఆది పురుష్’ సినిమా ప్రకటించిన ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ .రామాయణ గాథను తెరకెక్కించే సాహసం చేస్తాడా అని సందేహం వ్యక్తం చేసారు.కానీ ఈ సినిమాను ఎట్టకేలకు ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.

అల్లు అరవింద్ తన సినిమాను తెరకెక్కించే రామాయణం పట్టాలెక్కేవరకు 2024 పట్టే అవకాశం ఉంది.సినిమా రిలీజయ్యే వరకు ఎంత లేదన్న 2025 పట్టవచ్చని అంచనా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube