ఎన్టీఆర్‌ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌

రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ సినిమా మొదలు పెట్టిన సమయంలోనే ఇద్దరు హీరోలను బ్యాలన్స్‌ గా చూపించి ఇద్దరికి సరైన న్యాయం చేస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి.అనుమానాలను పటా పంచలు చేస్తూ దర్శకుడు ప్రతి విషయంలోనూ రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ లకు సమానమైన న్యాయం చేస్తానంటూ, వారిద్దరికీ ఎక్కడ ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా సన్నివేశాలను మరియు ఇతర విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాను అంటూ మీడియా సమావేశంలో హామీ ఇచ్చాడు.

 Ramaraju For Bheem Video Very Soon Ntr, Rrr, Ntr Birthday, Ramcharan, Rajamouli-TeluguStop.com

అన్నట్లుగానే షూటింగ్ సమయంలో మరియు ఇతరత్రా ప్రమోషన్ సమయంలో కూడా ఇద్దరు హీరోలకు సమాన ప్రాముఖ్యత ఇస్తూ రాజమౌళి వచ్చారు.ఇద్దరు బర్త్ డే లకు మేకింగ్ వీడియోలను విడుదల చేయాలని మొదట అనుకున్నట్లుగా రామ్‌ చరణ్‌ బర్త్‌ డేకు వీడియోను విడుదల చేశారు.

ఇక ఎన్టీఆర్ బర్త్ డే వీడియోను విడుదల చేయాల్సిన టైం లో కరోనా రావడంతో అంతా రివర్స్ అయింది.

రాజమౌళి భావించినట్లుగా కాకుండా వేరేలా మలుపు తిరగడంతో ఎన్టీఆర్ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ చేయలేదు.

ఆ కారణంగా ఎన్టీఆర్ బర్త్ డే కు నందమూరి అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేకపోయారు.అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ వీడియో ఎప్పుడు అంటు వార్తలు వస్తూనే ఉన్నాయి.

రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వీడియో చేసిన రాజమౌళి ఎన్టీఆర్ కోసం రామ్ చరణ్ తో వాయిస్ ఓవర్ చెప్పించి వీడియో చేయాల్సి ఉంది.అది ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ పై ప్రోమోకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.దసరా సందర్భంగా విడుదల అవుతుందనుకున్న ఎన్టీఆర్ లుక్ అంతకు ముందే అంటే అక్టోబర్ 22వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సినిమా షూటింగు ప్రారంభం అయినట్లుగా తెలిపేందుకు ఒక వీడియో నే విడుదల చేసిన జక్కన్న టీం ఎన్టీఆర్ వీడియో కి సంబంధించిన అప్డేట్ ని కూడా ఇచ్చారు.ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ దేశం మొత్తం ఉన్న సినీ అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube