మన టాలీవుడ్ లో శుక్రవారం అయితే చాలు వరుసగా సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ సమాయత్తం అవుతారు.ఎందుకంటే వీకెండ్ కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు మరింత ఉపయోగ పడుతుంది అని అలా వీకెండ్ లోనే సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు.
మరి లాస్ట్ వీక్ లో కూడా మన టాలీవుడ్ లో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.అందులో ఒకరి రామ్ పోతినేని ది వారియర్ కాగా.
మరొకటి సాయి పల్లవి గార్గి సినిమా.
ఈ రెండింటిలో వారియర్ సినిమా మంచి హైప్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మేకర్స్ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రొమోషన్స్ బాగా చేయడంతో రిలీజ్ కు ముందు బాగా అంచనాలు క్రియేట్ చేయడంలో సఫలం అయ్యారు.దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కు ఈ ప్రొమోషన్స్ బాగా సహాయ పడ్డాయి.
అయితే సినిమా మాత్రం మిశ్రమ స్పందన రావడంతో రెండు మూడు రోజులు మాత్రమే ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్ లో చూసారు.
అందుకే వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి.

ఇంకా బ్రేక్ ఈవెన్ కు చాలా టార్గెట్ ఉన్న కూడా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో ఇది బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమే అంటున్నారు.ఇక తమిళ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.మరో పక్క గార్గి సినిమా ఇంకొక సమస్య పేస్ చేస్తుంది.ఈ సినిమా ముందు నుండి ప్రొమోషన్స్ చేయడంలో విఫలం అయ్యారు.ఈ రోజుల్లో ప్రొమోషన్స్ ఎంత బాగా చేస్తే ప్రేక్షకులు అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.

కానీ గార్గి సినిమాకు ప్రొమోషన్స్ సరిగా చేయకపోవడంతో ఈ సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ రావడం లేదు.మంచి కంటెంట్ తో వచ్చింది అని ప్రశంసలు అయితే అందుకుంది కానీ సినిమా ప్రొమోషన్స్ లో ఫెయిల్ అవ్వడంతో చాలా మందికి ఈ సినిమా వచ్చినట్టు కూడా తెలియలేదు.దీంతో ఈ సినిమా హిట్ అయినా కలెక్షన్స్ లేవు.
ఇలా ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన సమస్యలను ఎదుర్కొంటుంది.







