రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ది వారియర్. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు.జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ది వారియర్ సీక్వల్ సినిమాపై కూడా హింట్ ఇచ్చాడు డైరక్టర్ లింగుసామి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరక్టర్ లింగుసామి స్పీచ్ లో వారియర్ సీక్వల్ కూడా ఉంటుందని క్లూ ఇచ్చేశాడు.అయితే అది జరగాలంటే ది వారియర్ మూవీ సూపర్ హిట్ అవ్వాల్సిందే.
కోలీవుడ్ లో మాస్ డైరక్టర్ గా మంచి క్రేజ్ ఉన్న లింగుసామి ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డాడు.ది వారియర్ సినిమాతో మళ్లీ ఆయన తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.
వారియర్ బజ్ చూస్తుంటే తప్పకుండా సినిమా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెప్పొచ్చు.

రామ్ కూడా ఈ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.ది వారియర్ సినిమా రామ్ కెరియర్ లో స్పెషల్ మూవీగా ఉండబోతుందని చెప్పొచ్చు.వరుస విజయాలతో దూసుకెళ్తున్న కృతి శెట్టి క్రేజ్ కూడా ఈ మూవీకి యాడ్ అవుతుంది.
అన్ని కలిసి రామ్ ది వారియర్ సినిమాని నెక్స్ట్ లెవల్ లో ఉంచనున్నాయి.వారియర్ అనుకున్న రేంజ్ హిట్ అయితే మాత్రం డైరక్టర్ లింగుసామి చెప్పినట్టు ఖచ్చితంగా ది వారియర్ సీక్వల్ ఉండి తీరుతుందని అంటున్నారు.
ఈ సినిమా తర్వాత రామ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.దాని తర్వాత హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ తో సినిమాకు రెడీగా ఉన్నాడని తెలుస్తుంది.







