ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ హీరోగా వస్తున్న స్కంద సినిమా( Skanda movie ) అక్టోబర్ 15న రిలీజ్ ఫిక్స్ చేశారు.రామ్ బోయపాటి కాంబినేషన్ లో హై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది.
ఈ సినిమా విషయంలో రామ్ సూపర్ కాన్ ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.సినిమాలో అతని యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
అఖండ హిట్ తో సూపర్ ఫాం లో ఉన్న బోయపాటి శ్రీను రామ్ సినిమాను కూడా ఆ రేంజ్ హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు.శాంపిల్ గా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఇక ఈ సినిమాతో రామ్( Ram Pothineni ) 100 కోట్ల టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారని అర్ధమవుతుంది.

రామ్ బోయపాటి శ్రీను( Boyapati srinu ) ఈ కాంబినేషన్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుంది.ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది.అందుకే స్కంద సినిమాతో రామ్ కచ్చితంగా కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్లు కొడతాడని అంటున్నారు.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలో రామ్ లుక్స్, యాక్షన్ అంతా బోయపాటి మీటర్ కు తగినట్టుగా అదిరిపోతుందని తెలుస్తుంది.
రామ్ ది వారియర్ వర్క్ అవుట్ కాకపోవడంతో స్కంద తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.







