యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘రెడ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటే ప్రయత్నం చేశాడు రామ్.
కాగా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘రెడ్’ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తోంది.
అయితే ఇవేమీ పట్టించుకోని రామ్, తన నెక్ట్స్ ప్రాజెక్టులను వరుసబెట్టి లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా బోల్డ్ కంటెంట్ చిత్రాలు చేసేందుకు రామ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి తరహా చిత్రాల్లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపాడు.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ ఈ మేరకు కామెంట్స్ చేశారు.
తనకు బోల్డ్ కంటెంట్ సినిమా కథ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చాడు.అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ కంటెంట్ సినిమా కథ తనవద్దకు ఇప్పటివరకు రాలేదని, ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేస్తానని అన్నారు.
అయితే బోల్డ్ కంటెంట్ చిత్రాల్లో నటించడం అంత ఈజీ కాదని ఆయన అన్నాడు.అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చేయాలంటే చాలా గట్స్ ఉండాలని రామ్ అన్నాడు.
ఇక రామ్ నటించిన రెడ్ చిత్రంలో అతడు డ్యుయెల్ రోల్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమాను ప్రేక్షకలు బాగానే ఆదరిస్తున్నారు.
ఇక ఈ సినిమా తరువాత రామ్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరి రామ్ కెరీర్‌లో అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ కంటెంట్ సినిమా పడుతుందో లేదో చూడాలి అంటున్నారు ఆయన అభిమానులు.







