మళ్ళీ పాత పంథాలోనే రామ్-పూరీ.. డబుల్ ఇస్మార్ట్ తో హిట్ అందుకునేనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇష్మార్ట్ శంకర్( Ishmart Shankar ) సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన సినిమానే ఇష్మార్ట్ శంకర్.

 Ram-puri's Double Mass With Double Ismart , Rapo20, Ram Pothineni, Boyapati Srin-TeluguStop.com

ఈ సినిమాతో ఇద్దరు సాలిడ్ హిట్ అందుకుని కెరీర్ లోనే మరో మెట్టు ఎక్కారు.గత నాలుగేళ్ళ క్రితం ఈ సినిమా వచ్చి మాసివ్ హిట్ అందుకుంది.

పూరీ జగన్నాథ్( Puri Jagannath ) టేకింగ్ అండ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.ఓవర్ నైట్ లో కథ పూర్తి చేసిన ఆశ్చర్యం అవసరం లేదు.

అయితే ఈ మధ్య ఈయన కథ – స్క్రీన్ ప్లే మరింత బెటర్ గా ఉండాలని విమర్శలు వస్తూనే ఉన్నాయి.అయితే రామ్ తో సినిమా చేసేప్పుడు మాత్రం పూరీ భిన్నంగా వర్క్ చేసాడు.

ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని పలు చర్చలు జరిపి ఇష్మార్ట్ శంకర్ వంటి సినిమాను తీసుకు వచ్చారు.

Telugu Rapo, Boyapati Srinu, Ismart Shankar, Liger, Puri Jagannadh, Ram Pothinen

ఇప్పుడు మరోసారి రామ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు పూరీ.డబుల్ ఇష్మార్ట్ పేరుతో( Double Ishmart ) రాబోతున్నారు.అందుకే ఈసారి మరింత సుదీర్ఘంగా చర్చలు జరిపి సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించారు.

రామ్ లుక్, మ్యానరిజం, క్యారెక్టర్స్ పై మరింత చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.ఇక ఈ సినిమా ప్రకటన రోజునే వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ అంటూ ప్రకటించాడు.

లైగర్ తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్న పూరీ మరింత కసితో ఈ సినిమాను సూపర్ హిట్ చేయాలని కసరత్తులు చేస్తున్నాడు.

Telugu Rapo, Boyapati Srinu, Ismart Shankar, Liger, Puri Jagannadh, Ram Pothinen

ఇదిలా ఉండగా రామ్ ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్నాడు.కథానాయకుడిగా శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”RAPO20′‘.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube