'స్కంద' నుండి సెకండ్ సింగిల్.. ఈసారి మరింత ఎనర్జిటిక్ గా..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో యాక్షన్ మూవీస్ ను లైన్లో పెడుతూ వాటిని పూర్తి చేస్తున్నాడు.ఈ సినిమాలతో మాస్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడు.

 Ram Pothineni Boyapati's Skanda Second Single Update, Ram Pothineni, Tollywood-TeluguStop.com

మరి రామ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ”స్కంద” ( Skanda )ఒకటి.ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) డైరెక్ట్ చేస్తుండగా మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

రామ్ సరసన అంతకంటే ఎనర్జీతో మెప్పించే శ్రీలీల ( Sreeleela )హీరోయిన్ గా నటిస్తుండడంతో అందరి కళ్ళు ఈ జంట మీద ఉన్నాయి.ఈ ఎనర్జిటిక్ జంటను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురు చూస్తుండగా ఇప్పటికే ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.సెప్టెంబర్ లో రిలీజ్ చేయనుండగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా రాబోతుంది.ఈ రోజు సాయంత్రం 6 గంటల 21 నిముషాలకు ఈ సాంగ్ లిరికల్ వీడియో ప్రోమో రిలీజ్ చేయనున్నారు.

పూర్తి సాంగ్ ను ఆగస్టు 18న సాయంత్రం 5 గంటల 49 నిముషాలకు రిలీజ్ కానుంది.గందరబాయి అంటూ సాగే ఈ సాంగ్ కూడా ఎనర్జిటిక్ డాన్స్ తో ఉండబోతుంది అని పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది.

మరి ఈ సాంగ్ ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube