‘స్కంద’ నుండి సెకండ్ సింగిల్.. ఈసారి మరింత ఎనర్జిటిక్ గా..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో యాక్షన్ మూవీస్ ను లైన్లో పెడుతూ వాటిని పూర్తి చేస్తున్నాడు.

ఈ సినిమాలతో మాస్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడు.మరి రామ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ''స్కంద'' ( Skanda )ఒకటి.

ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) డైరెక్ట్ చేస్తుండగా మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

"""/" / రామ్ సరసన అంతకంటే ఎనర్జీతో మెప్పించే శ్రీలీల ( Sreeleela )హీరోయిన్ గా నటిస్తుండడంతో అందరి కళ్ళు ఈ జంట మీద ఉన్నాయి.

ఈ ఎనర్జిటిక్ జంటను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురు చూస్తుండగా ఇప్పటికే ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సెప్టెంబర్ లో రిలీజ్ చేయనుండగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా రాబోతుంది.ఈ రోజు సాయంత్రం 6 గంటల 21 నిముషాలకు ఈ సాంగ్ లిరికల్ వీడియో ప్రోమో రిలీజ్ చేయనున్నారు.

పూర్తి సాంగ్ ను ఆగస్టు 18న సాయంత్రం 5 గంటల 49 నిముషాలకు రిలీజ్ కానుంది.

గందరబాయి అంటూ సాగే ఈ సాంగ్ కూడా ఎనర్జిటిక్ డాన్స్ తో ఉండబోతుంది అని పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది.

"""/" / మరి ఈ సాంగ్ ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.