జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రామ్( Ram Movie ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే .
ఈ సినిమా ద్వారా సూర్య (Suriya ) అయ్యాల సోమయాజులు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్లలో భాగంగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో రామ్ చరణ్ ( Ram charan) నటించినటువంటి గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.
తాను ఈ సినిమాలో కూడా నటించారని హీరో నవీన్ చంద్ర బ్యాచ్ లో తను కూడా కనిపిస్తాను అంటూ ఈయన వెల్లడించారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను సూర్య గుర్తు చేసుకున్నారు.ఈ సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశంలో నటించే సమయంలో రామ్ చరణ్ తనని కొడుతూ సారీ చెప్పేవారు అంటూ ఈయన తెలిపారు.ఒక యాక్షన్ సీక్వెన్స్( Action Scenes ) లో భాగంగా రామ్ చరణ్ కొడితే మేము గాలిలోకి బౌన్స్ అవ్వాలి.
ఆ సీన్ చేయడానికి సుమారు 10 టేక్ లు తీసుకున్నాము.
ఇలా రామ్ చరణ్ గారు పది సార్లు నన్ను కొట్టి నాకు సారీ చెప్పారు.కొట్టిన ప్రతిసారి వచ్చి సారీ చెప్పేవారు.తాను అమృత్ సర్ షెడ్యూల్లో ఓ పదిహేను రోజులు వర్క్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు.
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఎంతో హంబుల్ పర్సన్ అంటూ సూర్య చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక గేమ్ చేంజర్ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy