అవతార్ 2 సినిమాపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. ఆ మాట అంటే నేరం అంటూ?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ కోసం చిన్న పెద్ద అని తేడా లేకుండా బాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూశారు.

 Ram Gopal Varma Reacts About Avatar Movie Avatar 2 , James Cameron , Ram Gopal-TeluguStop.com

అయితే ఎట్టకేలకు ప్రేక్షకుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ తాజాగా విడుదల అయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం థియేటర్లలో అవుతార్ 2 సినిమా సందడి చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.ఈ సినిమాను చూసిన ప్రేక్షకులలో మరొక లోకంలోకి తీసుకెళ్తోంది.

ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అవతార్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా స్పందించారు.ఏ విషయం గురించైనా తనదైన స్టైల్‌లో అభిప్రాయాన్ని తెలిపే వర్మ అవతార్‌ రివ్యూలో కూడా తన మార్క్‌ చూపించారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.ఇప్పుడే అవతార్2లో స్నానం చేసి వచ్చాను.దీనిని సినిమా అనడం నేరంతో సమానం.

ఎందుకంటే అద్భుతమైన విజువల్స్‌తో అబ్బురపరిచే యాక్షన్‌తో జీవితకాలానికి సరిపోయే అనుభూతిని అందించింది అవతార్‌ 2 సినిమా.మరోలోకంలో విహరించినట్లు ఉంది అంటూ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్విట్‌ చేశారు.ఇక అవతార్‌ మొదటి భాగంలో పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్ రెండో భాగంలో ప్రేక్షకులను సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు.

కాగా ఈ సినిమాని చూసిన పలువురు నెటిజన్స్ ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube