ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ట్రెండ్ అవుతున్న ఎస్‌బీఐ పాస్‌బుక్.. ఎందుకంటే?

ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ డిసెంబర్ 18న అంటే ఆదివారం నాడు జరగనుంది.ఈ ఫైనల్స్‌లో లుసైల్ స్టేడియం వేదికగా ట్రోఫీ కోసం అర్జెంటీనా, ఫ్రాన్స్ తలపడనున్నాయి.

 Sbi Passbook Which Is Trending During Fifa World Cup Final Because, Football M-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రీడాభిమానులను ఆకర్షించే ఈ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎస్‌బీఐ పాస్‌బుక్ వైరల్‌గా మారింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్‌బుక్‌కి, ఫిఫా ప్రపంచ కప్‌కి సంబంధం ఏంటి? ఆ బ్యాంక్ పాస్‌బుక్ ఇప్పుడు ఎందుకు వైరల్‌ అవుతోంది? తెలుసుకుందాం.

భారతదేశంలోని అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్‌బుక్ ఎలా ఉంటుందో భారతదేశంలోని చాలామందికి తెలుసు.ఈ బ్యాంక్ పాస్‌బుక్ కవర్ బ్లూ అండ్ వైట్ కలర్స్‌లో ఉంటుంది.

వీటి మధ్య తెల్లటి ప్యానెల్‌పై నలుపు రంగులో రాసిన బ్యాంక్ పేరు, లోగో కనిపిస్తుంది.అచ్చం అలాంటి కలర్ కాంబినేషన్‌లో అర్జెంటీనా ఆటగాళ్ల జెర్సీ, ఆ కంట్రీ ఫ్లాగ్ కూడా ఉంది.

దాంతో ‘అర్జెంటీనా ఓడిపోతే తమ డబ్బు మొత్తం పోతుందని భారతీయులు భావిస్తున్నారు.భారతీయులు అర్జెంటీనాకు అభిమానులు కావడానికి కారణం ఏంటంటే అర్జెంటీనా ఎస్‌బీఐకి అఫిషియల్ పార్ట్‌నర్.’ అని ట్వీట్స్‌ చేస్తూ పాస్‌బుక్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

అలా ఎస్‌బీఐ పాస్‌బుక్ ట్రెండ్ అవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.2014 ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓటమిని చవిచూసింది మెస్సీ టీమ్.1978, 1986లలో అర్జెంటీనా వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచింది.ఇప్పుడు గెలిస్తే మూడో టైటిల్‌ను గెలిచినట్లు అవుతుంది.అలాగే మెస్సీకి మంచి పేరు వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube