అమ్మాయిలపై దాడి.. రామ్ గోపాల్ వర్మ ఫైర్?

తెలుగు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన దర్శకత్వంలో ఎంతోమంది నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.

సమాజంలో జరిగే ప్రతి ఒక్క విషయానికి రియాక్ట్ అవుతుంటాడు.అంతేకాకుండా కొన్ని విషయాలలో బాగా ట్రోల్స్ కూడా చేస్తుంటాడు.

ఇక ఆయనకు సోషల్ మీడియాలో ఎన్నో నెగటివ్ కామెంట్స్ వస్తుంటాయి.కానీ వాటిని అస్సలు పట్టించుకోడు వర్మ.

Advertisement

ఒక్కోసారి ఆయన పెట్టే పోస్టులు అర్థం కాక తల పీక్కునేలా ఉంటాయి.ఇదిలా ఉంటే తాజాగా అమ్మాయిలపై జరిగిన దాడికి వర్మ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

ఇటీవలే మధ్యప్రదేశ్ లో దార్ జిల్లా పిపల్వ గ్రామానికి చెందిన ఓ గిరిజన అక్కాచెల్లెళ్లు తమ మేనమామ కుమారులతో కొంతకాలం నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నారని.తమ కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై జూన్ 22న వాళ్లపై దాడి చేశారు.

వాళ్లని జుట్టు పట్టి ఈడుస్తూ కర్రలతో బాగా దాడి చేశారు.ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ప్రస్తుతం దేశం మొత్తం ఈ ఘటన గురించి తెగ మండిపడుతున్నారు.

ఇక పోలీసులు అమ్మాయిల పై దాడి చేసిన వారిని అరెస్టు చేశారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఈ నేపథ్యంలో ఈ ఘటన వీడియోను రామ్ గోపాల్ వర్మ వీక్షించగా తెగ ఫైర్ అవుతున్నాడు.ఈ దారుణాన్ని తాను నమ్మలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.దాడికి పాల్పడిన వారందరినీ సరైన శిక్ష వేయకపోతే తనకు ఈ దేశంపై నమ్మకం పోతుందని తేల్చి చెప్పేశాడు.

Advertisement

గతంలో కూడా ఇటువంటి విషయాల పట్ల వర్మ చాలాసార్లు స్పందించాడు.

ఇక వర్మ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే రెండు రోజుల కిందట బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావు ల విడాకుల గురించి కూడా స్పందించగా వారిద్దరూ సంతోషంగా విడిపోవడమే కరెక్ట్ అంటూ కామెంట్ చేశాడు.

తాజా వార్తలు