పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి గడిపిన రాం గోపాల్ వర్మ.

అదేంటి.పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రాంగోపాల్ వర్మ ఒక రాత్రి గడపడం ఏంటి ? అనేకదా మీ అనుమానం.

ఆయన ఏం క్రైమ్ చేశారు, ఎందువల్ల పోలీస్ స్టేషన్ లో ఒక రాత్రి ఉండాల్సి వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

రాంగోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీకి రాకముందు అనేక చిన్న చిన్న పనులు చేశారు.మొదట్లో తాజ్ కృష్ణ హోటల్ కి సైట్ ఇంజనీర్ గా, ఆ తర్వాత అమీర్ పెట్ లో మూవీ హౌస్ అనే పేరుతో ఒక వీడియో క్యాసెట్ షాప్ ని నడిపించారు.

తండ్రి తో తగదా పడి అమీర్ పేట్ లో వీడియో క్యాసెట్ షాప్ తెరిచారు.ఆయన ఇంజనీర్ గా పని చేస్తున్నప్పుడు కేవలం ఎనిమిది వందల రూపాయల జీతం వచ్చేది.కానీ వీడియో క్యాసెట్ షాప్ ఓపెన్ చేశాక నెలకు 20 వేలకు పైగా సంపాదించడం మొదలుపెట్టారు.

మొదట్లో పంజాగుట్టలో ఫాంటసీ అనే వీడియో లైబ్రరీ ఉండేది.దానికి ఎక్కువగా జనాలు వెళ్లేవారు.

Advertisement

కానీ దానికి పోటీగా మూవీ హౌస్ పెట్టడం కరెక్ట్ కాదు అని చాలా మంది వాదించారు.ఎవరి మాట వినకుండా మూవీ హౌస్ మొదలుపెట్టారు వర్మ.

ఫాంటసీకి పార్కింగ్ లేకపోవడం మూవీ హౌస్ కి పార్కింగ్ ఎక్కువగా ఉండడం వర్మకు కలిసొచ్చింది.

ఒక ఎనిమిది నెలలపాటు వర్మ ఎడా పడా డబ్బులు సంపాదించాడు కానీ ఒకరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మూవీ హౌస్ పైన రైడింగ్ జరిగింది.అమితాబ్ నటించిన ఆఖరి రాస్తా అనే సినిమా పైరసీ క్యాసెట్లు అమ్మడంతో వర్మను అరెస్టు చేశారు.ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో పరిచయం చేశారు పోలీసులు.

ఇప్పటికే పోలీసుల ప్రవర్తన సామాన్యులతో ఎలా ఉంటుంది అని తెలిపే సీన్స్ ఉన్నప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసుల తీరుని గుర్తుచేసుకొని మరి సినిమా తీస్తారట వర్మ.అలా వర్మ జీవితంలో పోలీసుల పరిచయం చాలా నేర్పించింది అంటారు.

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?
Advertisement

తాజా వార్తలు