మెగా ఫ్యామిలీలో చిరంజీవి( Chiranjeevi ) , పవన్ కళ్యాణ్ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు రామ్ చరణ్ కి వచ్చిందని చెప్పుకోవచ్చు.ఈ హీరో మంచి మంచి కథలు నేర్చుకుంటూ పాన్ ఇండియా హీరోగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు.
ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ ( Game changer ) అనే సినిమాలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అని ఇప్పటికే సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే అపజయాలు ఎరగని డైరెక్టర్ శంకర్ అలాగే పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ కలయికలో సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అలాగే ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ( Bucchibabu )) తో మరో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

అయితే చిరంజీవి ( Chiranjeevi ) తో ఎప్పుడూ కూడా ఒక స్నేహితుడు లాగా ఉండే రామ్ చరణ్ ఒకానొక సమయంలో చిరంజీవి చేసిన పనికి గజగజా వణికిపోయారట.మరి రామ్ చరణ్ వణికి పోయేంతలా చిరంజీవి ఏం పని చేశారు.అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.చిరంజీవి తన కొడుకుని ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా ద్వారా పరిచయం చేద్దాం అనుకున్నారట.ఇక అదే సమయంలో యాక్టింగ్ లో కోచింగ్ ఇప్పించిన తర్వాత కూడా సినిమాల్లోకి వచ్చే ముందు రియల్ స్టార్ శ్రీహరి ( Srihari ) కి ఫోన్ చేసి హరి నా కొడుకు నీ దగ్గరికి పంపిస్తున్నాను.
నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు.
నీలాగే మంచి ఫైట్లు అన్ని నేర్చుకోవాలి అని చెప్పారట.ఇక చిరంజీవి ( Chiranjeevi ) స్వయంగా ఫోన్ చేసి తన కొడుకుకి కోచింగ్ ఇవ్వమని చెప్పడంతో శ్రీహరి చాలా సంతోషపడ్డారట.
ఇక తండ్రి చెప్పినట్టే శ్రీహరి దగ్గరికి ట్రైనింగ్ కోసం వెళ్లారట రామ్ చరణ్.అయితే మామూలుగానే సినిమాల విషయంలో వర్కౌట్స్ విషయంలో ఎంతో సీరియస్ గా శ్రమించే శ్రీహరి రామ్ చరణ్ కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం చాలా బాగా శ్రమించి ట్రైనింగ్ ఇచ్చారట.

కానీ రామ్ చరణ్ శ్రీహరి దగ్గర కనీసం రెండు రోజులు కూడా ఉండకుండా ఇలాంటివి నావల్ల కాదు బాబోయ్ అని చిరంజీవి దగ్గరికి వచ్చి చెప్పారట.ఆ ఇక ఈ ఒక్క విషయంలో చిరంజీవికి రామ్ చరణ్ భయపడిపోయి నేను ఇంకొకసారి ఆయన దగ్గరికి వెళ్ళను నాన్న అని చెప్పారట.దాంతో చిరంజీవి కూడా శ్రీహరి దగ్గరికి పంపించలేదట.ఇక శ్రీహరి దగ్గరికి ట్రైనింగ్ వెళ్లి భయపడిన రాంచరణ్ కి మళ్లీ శ్రీహరితో కలిసి మగధీర ( Magadheera ) సినిమాలో చేసే అవకాశం వచ్చింది.
ఇక ఈ సినిమా చేసే టైంలో శ్రీహరికి రామ్ చరణ్ కి మధ్య మంచి రిలేషన్ ఏర్పడి అప్పటినుండి రామ్ చరణ్ కి శ్రీహరి పై చాలా ప్రేమ పెరిగిందట.







