టాలీవుడ్ హీరో రామ్ చరణ్, భార్య ఉపాసన( Ram charan ) ఇటీవలే తల్లిదండ్రులైన విషయం మనందరికీ తెలిసిందే.పెళ్లయిన తర్వాత దాదాపు 11 ఏళ్లకు ఉపాసన, రామ్ చరణ్ లు తల్లిదండ్రులు కావడంతో మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.
మెగా ప్రిన్సెస్ కు మెగా కుటుంబ సభ్యులు భారీగా ఆహ్వానం పలికారు.అటు ఉపాసన తల్లిదండ్రులు ఇటు చిరంజీవి తల్లిదండ్రులు చెర్రీ కూతురితో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
మొన్నటికి మొన్న చెర్రీ కూతురు నామకరణం రోజు వేడుకలను ఎంతో పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా అట్టహాసంగా జరిపిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం( Independence day ) సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు.సినిమా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
ఇక మెగా వారసురాలు కూడా తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొంది.కేవలం పాల్గొనడమే కాదు ఆ త్రివర్ణ పతాకాన్ని తన చేతులతో ఎగరవేసింది.తన అమ్మమ్మ,తాతయ్యతో కలిసి జెండా వందనం చేసింది.ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన( Upasana ) తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది ఉపాసన.క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ అమ్మమ్మ,తాతయ్య.అమూల్యమైన క్షణాలు అని రాసుకొచ్చారు ఉపాసన.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.కాగా చరణ్ అండ్ ఉపాసన ఇప్పటి వరకు క్లీంకార పేస్ ని రివీల్ చేయలేదన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఉపాసన షేర్ చేసిన ఫొటోల్లో క్లీంకార పేస్ కొంచెం కనిపించడంతో ఇది చూసిన మెగా అభిమానులు లవ్ సింబల్స్ తో కామెంట్స్ బాక్స్ ని నింపేస్తున్నారు.







