ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల కారణంగా గత నెల 28వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా అనారోగ్య సమస్యలతో ఇందిరా దేవి మరణించడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఆమె చివరి చూపులు చూసి మహేష్ బాబు కుటుంబానికి సంతాపం తెలిపారు.
ఈ క్రమంలోని తాజాగా మహేష్ బాబు తల్లి 11వ రోజు కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరై ఆమెకు నివాళులు అర్పించారు.
ఈ విధంగా మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి 11వ రోజు కార్యక్రమంలో ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఇకపోతే సినిమా షూటింగులతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ ఆమె మరణించిన రోజున రాలేకపోవడంతో ఆమె పదకొండవ రోజు కార్యక్రమాలలో పాల్గొన్నారు.
రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇద్దరు ఇందిరా దేవి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం కృష్ణ గారితో మాట్లాడారు.అలాగే రామ్ చరణ్ మహేష్ బాబుతో మాట్లాడి తనను పరామర్శించగా ఉపాసన సైతం నమ్రత సితారతో మాట్లాడి వారితో కలిసి ఫోటో దిగారు.

ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు మహేష్ బాబుతో వారి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక తల్లి మరణంతో మహేష్ బాబు తన సినిమా షూటింగులకు కాస్త బ్రేక్ ఇచ్చారు.ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.అయితే తన తల్లి మరణించడంతో ఈ సినిమా షూటింగుకు కాస్త బ్రేక్ ఇచ్చారు.తన తల్లి కార్యక్రమాలన్నింటిని పూర్తిచేసిన అనంతరం మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.







