డ్రైవింగ్ లైసెన్స్ కోసం మరో హీరోతో జత కట్టడానికి రెడీ అవుతున్న వెంకీ

మలయాళం నుంచి ప్రస్తుతం డజనుకి పైగా సినిమాలు తెలుగులో రీమేక్ కి రెడీ అవుతున్నాయి.ఇప్పటికే వీటిలో చాలా వరకు సెట్స్ పై ఉన్నాయి.

 Ram Charan To Remake 'driving License' With Venkatesh, Drushyam 2 Movie, Tollywo-TeluguStop.com

మలయాళంలో తక్కువ బడ్జెట్ తో పవర్ ఫుల్ కంటెంట్ తో అక్కడి దర్శకులు సినిమాలు చేస్తూ ఉంటారు.ఈ కారణంగా అక్కడ సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

అయితే మన టాలీవుడ్ దర్శకులు ఎప్పుడూ కూడా ఒకే మూసలో కమర్షియల్ కథలు లేదంటే, ఒక సినిమా హిట్ అయితే అదే జోనర్ పట్టుకొని పదుల సంఖ్యలో కథలు సిద్ధం చేసుకొని సినిమాలు చేస్తూ ఉంటారు.ఈ మధ్యకాలంలో యువతరం టాలెంటెడ్ దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు.

అయితే నిర్మాతలు మాత్రం సేఫ్ జోన్ లో సినిమాలు చేసుకుంటే బెటర్ అనే ఉద్దేశ్యంలో అక్కడ హిట్ అయిన కథలని తీసుకొచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల మీద వదులుతారు.ఈ నేపధ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ మొదలు విశ్వక్ సేన్ పాగల్ వరకు అన్ని కూడా రీమేక్ సినిమాలే.

ఇదే కోవలో ప్రస్తుతం అరడజను రీమేక్ కథలు సెట్స్ పై ఉండగా మరో అరడజను సినిమాలు రైట్స్ ని నిర్మాతలు కొనేసి రీమేక్ కోసం హీరోలని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు.విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప, దృశ్యం2, ఎఫ్3 మూవీలు చేస్తున్నాడు.

ఇందులో రెండు సినిమాలు రీమేక్ సబ్జెక్ట్ లే కావడం విశేషం.ఇక మరో మల్టీ స్టారర్ రీమేక్ కోసం వెంకటేష్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మలయాళంలో పృథ్వీరాజ్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రైట్స్ ని రామ్ చరణ్ ఇప్పటికే కొనేసి ఉంచుకున్నాడు.దీనిని తన కొనెదల ప్రొడక్షన్ లో నిర్మించాలని భావిస్తున్నాడు.

ఇక ఇందులో ఒక హీరోగా నటించడానికి వెంకటేష్ ఒకే చెప్పాడని తెలుస్తుంది.ఇక మరో హీరో పాత్ర కోసం స్టార్ నటుడుని చూస్తున్నట్లు బోగట్టా.

లేదంటే మెగా ఫ్యామిలీ హీరోలలో ఒకరిని ఈ సినిమా కోసం ఫైనల్ చేసే పనిలో రామ్ చరణ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube