అఫీషియల్ : జెర్సీ డైరెక్టర్ తో రామ్ చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల సిద్ధంగా ఉంచాడు.

మరో పక్క తన తండ్రి చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ నటిస్తున్నాడు.

ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేయబోతున్నారు.ఇక చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా కూడా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇక రామ్ చరణ్ కూడా తన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు.

Advertisement
Ram Charan To Join Hands With Director Gowtam Tinnanuri, Gowtam Tinnanuri, Shank

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతుంది.

Ram Charan To Join Hands With Director Gowtam Tinnanuri, Gowtam Tinnanuri, Shank

ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చరణ్ తన తర్వాత ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.ఈ రోజు దసరా పండుగ సందర్భంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ తన తర్వాత సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Ram Charan To Join Hands With Director Gowtam Tinnanuri, Gowtam Tinnanuri, Shank

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.దసరా పండగ రోజు అనుకోని అప్డేట్ రావడంతో మెగా అభిమానులు ఖుషీగా ఉన్నారు.ప్రెసెంట్ శంకర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.

ఈ సినిమా పూర్తి అయినా తర్వాత గౌతమ్ తిన్ననూరి, రామ్ చరణ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు