ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు తన సెకండ్ సినిమా తారక్ తో ప్లాన్ చేస్తే అది వర్క్ అవుట్ కాలేదు అందుకే చరణ్ తో ( Ram Charan ) సినిమా చేస్తున్నాడు. చరణ్ 16వ సినిమాగా రాబోతున ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు.అయితే లేటెస్ట్ గా ఈ సినిమా హాలీవుడ్ వర్షన్ కూడా ప్లానింగ్ లో ఉందట.
ఆర్.ఆర్.ఆర్ తో హాలీవుడ్ లో చరణ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ చరణ్ యాక్టింగ్ గురించి వారెవా అనేశారు.అందుకే చరణ్ తో బుచ్చి బాబు( Bucchi Babu ) చేస్తున్న సినిమాను ఇంగ్లీష్ వర్షన్ కూడా రెడీ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.అదే జరిగితే మాత్రం ఆర్.
ఆర్.ఆర్ తర్వత చరణ్ కి ఈ సినిమా మరోసారి ఇంటర్నేషనల్ రేంజ్ లో సత్తా చాటే ఛాన్స్ ఉంటుంది.RRR నాటు నాటు సాంగ్ కే ఆస్కార్ రాగా చరణ్ తన 16వ సినిమాతో ఈసారి సినిమాకు గాని తనకు గానీ బెస్ట్ అవార్డ్ వచ్చేలా కృషి చేస్తున్నారని తెలిసిందే.చరణ్ 16వ సినిమా ఇంగ్లీష్ రిలీజ్ మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది.







