రామ్ చరణ్ చేసేది ఆ సినిమా సీక్వెలా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న చరణ్, తన నెక్ట్స్ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించాడు.

 Ram Charan Shankar Movie Is A Sequel-TeluguStop.com

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు చరణ్ రెడీ అయ్యాడు.ఈ సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో రోజుకో వార్త వినిపిస్తూ వస్తోంది.తాజాగా ఈ సినిమా గతంలో వచ్చిన ఓ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 Ram Charan Shankar Movie Is A Sequel-రామ్ చరణ్ చేసేది ఆ సినిమా సీక్వెలా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ఒకే ఒక్కడు’ చిత్రం గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించగా అందాల భామ మనీషా కొయిరాల హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.దీంతో ఈ సినిమాకు తమిళ, తెలుగు భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

ఇక ఇదే సినిమాను హిందీలో ‘నాయక్’ అనే పేరుతో రీమేక్ చేశాడు దర్శకుడు శంకర్.కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాను తెరకెక్కిస్తున్నాడట ఈ డైరెక్టర్.

పొలిటికల్ థ్రిల్లర్ కథతో చరణ్ చేయబోయే ఈ సినిమా భారీ తారాగణంతో రానుందట.

మరి నిజంగానే చరణ్ చేయబోయేది ఒకేఒక్కడు చిత్రానికి సీక్వెలా లేక వేరే కథతో రాబోతున్న ఓ పొలిటికల్ సినిమానా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

#Ram Charan #RC #Kiara Advani #Shankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు