'గేమ్ చేంజర్' నుండి లీకైన ట్రైన్ ఫైట్..ఆందోళనలో మేకర్స్!

Ram Charan Shankar Game Changer Movie Train Fight Scene Leaked,Ram Charan,Game Changer Movie,Fight Scene Leaked,Jaragandi Jaragandi Song,Kiara Advani,Game Changer Leaks

#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ వరల్డ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) తన తదుపరి చిత్రం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్'( Game Changer ) అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా #RRR మూవీ ప్రొమోషన్స్ సమయం లోనే ప్రారంభం అయ్యింది.

 Ram Charan Shankar Game Changer Movie Train Fight Scene Leaked,ram Charan,game C-TeluguStop.com

ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన సినిమా.కానీ ఎప్పటి నుండో బ్యాలన్స్ షూటింగ్ మిగిలిపోయిన కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది.

అలా నెలలో 15 రోజులు ‘ఇండియన్ 2 ‘ చేస్తే మరో 15 రోజులు ‘గేమ్ చేంజర్’ చిత్రం చేసేవాడు.అందువల్ల గేమ్ చేంజర్ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది.

ఒక సినిమా ఆలస్యం అయితే అందులో ఉండే కంటెంట్ లీక్ అవ్వడం అనేది సర్వసాధారణం.గతం లో ఎన్నోసార్లు అలా జరిగింది.

Telugu Scene Leaked, Game Changer, Kiara Advani, Ram Charan-Movie

‘గేమ్ చేంజర్’ విషయం లో కూడా అదే జరిగింది.రీసెంట్ గానే ఈ చిత్రం నుండి ‘జరగండి.జరగండి'( Jaragandi Jaragandi Song ) అనే సాంగ్ లీక్ అయ్యి సోషల్ మీడియా లో సంచలనం సృష్టించింది.ఈ పాటకి ఫ్యాన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.

శంకర్ రేంజ్ సాంగ్ ఇది కాదు అంటూ కామెంట్స్ చేసారు.అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైన్ ఫైట్ సన్నివేశం( Train Fight Scene Leak ) లీక్ అయ్యినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఫైట్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే రేంజ్ లో ఉందట.సినిమాకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఎడిటింగ్ వర్క్ కోసం టీం కి ఈ సన్నివేశాన్ని పంపగా, అది వాట్సాప్ లో లీక్ అయ్యింది.

ఒక వెబ్ సైట్ పోర్టల్ లో కూడా ఈ ఫైట్ ని అప్లోడ్ చేశారట.అయితే అప్రమత్తమైన మూవీ టీం వెంటనే ఆ వీడియో ని వెబ్ సైట్ నుండి తొలగించేశారట.

Telugu Scene Leaked, Game Changer, Kiara Advani, Ram Charan-Movie

అభిమానులు మరియు ప్రేక్షకులు చూసేలోపు ఆ వీడియో ని తొలగించడం తో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఇకపోతే వరుసగా ఈ లీక్స్ కి కారణం అవుతున్న వారిని గుర్తించడం ఇప్పుడు మేకర్స్ కి పెద్ద తలనొప్పిగా మారింది.ఎందుకంటే వీళ్లంతా ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు( Producer Dil Raju ) తో కలిసి కెరీర్ ప్రారంభం నుండి కలిసి పని చేస్తున్నారు , ఎంతో నమ్మకమైన వాళ్ళు.అలాంటి వారి నుండి ఎవరు లీక్ చేస్తున్నారు అనే విషయం కనిపెట్టడం పెద్ద సాహసమే.

ఇకపోతే ఈ చిత్రాన్ని ఈ ఏడాది లోపే పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube