మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) ప్రజెంట్ లైనప్ లో ఇద్దరు డైరెక్టర్లు ఉన్న విషయం తెలిసిందే.చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును వరల్డ్ వైడ్ గా తెచ్చుకుని ఈ స్థాయికి చేరుకున్నాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకుంటున్న చరణ్ ఒక సినిమాను ఇప్పటికే లాస్ట్ స్టేజ్ కు తెచ్చాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar ) దర్శకత్వంలో చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘గేమ్ చేంజర్'(Game Changer).ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుంది.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.ఇక చరణ్ ఈ సినిమా తర్వాత తన 16వ సినిమాను కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేసాడు.

ఈ సినిమా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ( Buchi Babu Sana ) దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.RC16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మరింత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.అయితే ప్రజెంట్ చేస్తున్న సినిమా పూర్తి అయితే కానీ నెక్స్ట్ ఈ సినిమాను చరణ్ స్టార్ట్ చేయడు.ఆ సమయంలో బుచ్చిబాబు కూడా సమయాన్ని వృధా చేయకుండా నటీనటుల ఎంపిక చేస్తున్నట్టు టాక్.
ఇది కూడా పాన్ ఇండియా కావడంతో గ్రాండ్ కాస్ట్ అండ్ క్రూ ను సెలెక్ట్ చేసారని ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని ఒక్క హీరోయిన్ మినహా ఆల్ మోస్ట్ క్యాస్టింగ్ అంతా లాక్ అయినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.మరి హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.
ఇక RC16 సినిమాను యూవీ క్రియేషన్స్ వారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.