మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
కాగా ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ కావడం ఖాయమని అంటున్నారు సినీ జనం.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందని, సినిమాను అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిస్తూ వస్తుంది.కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర హీరో రామ్ చరణ్ తాజాగా ఓ కామెంట్ చేశాడు.తాజాగా విజయవాడలోని ఓ స్టోర్‌ను ఓపెన్ చేయడానికి వెళ్లిన ఆయన్ను మీడియా ఆర్ఆర్ఆర్ రిలీజ్ గురించి అడగ్గా.
ఈ సినిమా రిలీజ్ 2020 వేసవిలో ఖచ్చితంగా ఉంటుందని తెలిపాడు.
దీంతో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు ప్రేక్షకులు అయోమయానికి గురవుతున్నారు.చిత్ర యూనిట్ సినిమాను జూలై 30న 2020లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుండగా, రామ్ చరణ్ ఇప్పుడు సినిమా రిలీజ్ వేసవిలో ఉంటుందని చెప్పడంతో క్లారిటీ మిస్ అవుతుందని ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.







