స్పోర్ట్స్ కథతో సినిమా తన డ్రీం ప్రాజెక్ట్ అన్న రామ్ చరణ్

సినిమాలో హీరో, హీరోయిన్స్ గా చేసేవారు ఎన్ని సక్సెస్ లు చూసిన కూడా ఇంకా కొంత మంది స్టార్స్ ఏవో కొత్తగా చేయాలని అనుకుంటారు.

అలాగే తమకంటూ కొన్ని పాత్రలు కచ్చితంగా చేయాలని, అలాంటి కొన్ని బ్యాక్ డ్రాప్ లో కథలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

స్టార్ హీరోలకి కూడా తమ డ్రీం ప్రాజెక్ట్, డ్రీం రోల్స్ అంటూ ఉంటాయి.జీవితంలో కచ్చితంగా వాటిని ఫుల్ ఫిల్ చేసుకోవాలని అనుకుంటారు.

Ram Charan Opens Up About His Dream Project, Tollywood, Sports Backdrop, Mega He

ఈ నేపధ్యంలోనే స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తాజాగా తన డ్రీం స్టొరీ గురించి మీడియాతో పంచుకున్నాడు.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీతో సెట్స్ పై ఉన్న రామ్ చరణ్ లాక్ డౌన్ సమయంలో కొత్త దర్శకుల కథలు వింటున్నాడు.

అలాగే పెద్ద దర్శకులు చెబుతున్న కథలు విని కొన్ని లైన్ లో పెట్టాడు.ఈ సందర్భంగా తన కెరియర్లో కచ్చితంగా చేయాలనుకుంటున్న సినిమా గురించి మనసు విప్పాడు.

Advertisement

స్పోర్ట్స్ డ్రామా ఒకటి చేయాలన్నది నా చిరకాల కోరిక.వాస్తవానికి గతంలో ఆర్బీ చౌదరి బ్యానర్లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో మెరుపు అనే సినిమాను స్టార్ట్ చేశాం కూడా.

కానీ, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు, ఆగిపోయింది.అప్పటి నుంచీ కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే ఒక కథ కోసం చూస్తున్నాను.

అయితే, ఇంతవరకు నన్ను టెంప్ట్ చేసే స్క్రిప్ట్ మాత్రం దొరకలేదు.వస్తే కనుక కచ్చితంగా చేస్తాను అని చెప్పాడు చరణ్.

మరి రామ్ చరణ్ కోరుకున్నట్లు స్పోర్ట్స్ నేపధ్యంలో కథలు సిద్ధం చేసుకున్న దర్శకులు ఎవరైనా రామ్ చరణ్ కి కలిసి మెప్పించగలిగితే సినిమా చేసే అవకాశం పట్టేసే ఛాన్స్ ఉంది .

సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!
Advertisement

తాజా వార్తలు