దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.
ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.
దాదాపు 478 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పుకుంటున్నారు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కాబోతుంది.
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి అన్ని కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 880 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.దీంతో ఇప్పుడు అందరి ద్రుష్టి ఆర్ ఆర్ ఆర్ ఓపెనింగ్స్ మీద పడ్డాయి.ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న క్రమంలో ఓపెనింగ్స్ కూడా అంతే స్థాయిలో ఉంటాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 50 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

టాలీవుడ్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు అందుకోబోతుంది.ఇప్పటికే అక్కడ ప్రీ బుకింగ్స్ అందరిని ఆశ్చర్య పరిచే విధంగా జరిగాయి.ఇక బాలీవుడ్ తో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం.
ఇదంతా చూస్తుంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఫస్ట్ డే దాదాపు 200 కోట్లు గ్రాస్ అందుకోవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు.మరి రిలీజ్ రోజు ఏం మ్యాజిక్ జరుగుతుందో చూడాలి.