ఆర్ఆర్ఆర్ లో ఈ తప్పు గమనించారా.. రిలీజ్ అయిన ఇన్నాళ్లకు బయటకొచ్చిందిగా!

కొందరు ప్రేక్షకులు సినిమాను కేవలం కథ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ వరకు చూస్తూ ఉంటారు.కానీ మరికొందరు ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాలో కావాలని వెతికి మరీ తప్పులు తీస్తూ ఉంటారు.

 Ram Charan Ntr Rajamouli Rrr Movie These Mistakes Details, Rrr, Ram Charan, Jr-TeluguStop.com

నిజానికి కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూసే సినిమాలలో కొన్ని పొరపాట్లు చాలా సులువుగా కనిపిస్తుంటాయి.దీంతో ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు.

కానీ కొన్ని పొరపాట్లను కొందరు ప్రేక్షకులు లోతుగా పరిశీలిస్తూ ఉంటారు.వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి ఆ సినిమా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు.అలా ఇప్పటికీ చాలామంది సినిమాల్లో వచ్చిన పొరపాట్లు గురించి సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేశారు.నిజానికి దర్శకులు, ఎడిటర్లు కూడా ఇటువంటి పొరపాట్లు కనిపించకూడదని కొన్ని జాగ్రత్తలు పడుతూ ఉంటారు.

మరికొందరు ప్రేక్షకులు అంతగా ఏమీ గమనించరు అనుకొని పొరపాట్లు చేస్తూ ఉంటారు.కానీ ప్రేక్షకులు పెద్ద పెద్ద సినిమాల విషయంలోనే ఎటువంటి పొరపాట్లు దొరుకుతాయా అని చూస్తారు.

ముఖ్యంగా తమకు నచ్చని హీరో సినిమా ఉంటే మాత్రం బాగా పరిశీలించి మరి ఆ తప్పును బయట పెడుతూ ఉంటారు.అలా తాజాగా పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాల్లో కూడా ఒక పొరపాటు దొరికిపోయింది.

ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తన దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.పైగా ఈ సినిమా ఫుల్ యాక్షన్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా ఆకట్టుకుంది.

దీంతో ఈ స్టార్ హీరోలు ఇద్దరు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ లుగా మారారు.

పైగా ఇతర సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్నారు.ఇక నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సస్పెన్స్ గా చూపించాడు దర్శకుడు.

పైగా ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు కూడా చేయకుండా అద్భుతంగా ఎడిట్ చేసి చూపించారు.

ఇక మొత్తానికి ఈ సినిమా విడుదలై చాలా రోజులుగా గా ఓటీటీ విడుదల కోసం తెగ ఎదురుచూస్తున్నారు.నిజానికి ఒక సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమాలోని పొరపాట్లు తొందరగా కని పెడుతుంటారు కొందరు ప్రేక్షకులు.కానీ ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాక ఆ సినిమాలోని ఒక పొరపాటు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఆ సినిమాలో ఎన్టీఆర్ బుల్లెట్ బండి మీద రైడ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు.నిజానికి ఇక్కడే ఒక ఇంటెలిజెంట్ ఫెలో ఒక పొరపాటును బయటపెట్టాడు.ఎన్టీఆర్ నడుపుతున్న బండి ఫోటోలను పెట్టి.ఆ బండి ముందల, వెనకాల నెంబర్ ప్లేట్ ను షేర్ చేసుకున్నాడు.

దాంతో ఆ నెంబర్లు వేర్వేరు ఉండటంతో వెంటనే ఆ పర్సన్ ఈ బండి పై కేసు పెట్టండి సార్ అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు.దీంతో ఆ పోస్ట్ ని చూసిన నెటిజన్లు కూడా ఈ పొరపాటు మేము గమనించలేదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube