అనుష్క శెట్టి( Anushka Shetty ), నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.( Miss Shetty Mr Polishetty ).
ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన అనుష్క బాహుబలి సిరీస్ తర్వాత అంతగా నటించి మెప్పించిన సినిమాలు లేవనే చెప్పాలి.
అనుష్క లాస్ట్ నటించిన నిశ్శబ్దం (Nishabdam) అనే లేడీ ఓరియెంటెడ్ చేసిన కూడా ఇది అంతగా ఆకట్టుకోలేక పోయింది.మరి లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.కానీ ఈ మధ్య వరుసగా ఈ సినిమాను నుండి అప్డేట్ లను ఇస్తూ ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచుతున్నారు.

ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్( UV Creations Banner ) వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.

ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ అవ్వగా ఆకట్టుకుంది.ఇక ఇదే టీజర్ పై తాజాగా రామ్ చరణ్( Ram Charan ) చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ నాకు బాగా నచ్చింది అని ఎంతో రిఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తుంది అని అంటూ చిత్ర యూనిట్ కు తన తరపున గుడ్ లక్ కూడా తెలిపాడు.ఈ పోస్ట్ నెట్టింట ఆసక్తిగా మారింది.







